కోడిచెరువును పవన్ కబ్జా చేసారన్నవారు ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటారో?!!
నిఖార్సయిన నాయకులు, నీతివంతమైన రాజకీయాలు చేసేవారు చాలా అరుదుగా వుంటారు. ప్రస్తుతం కోట్లకొద్ది అవినీతి మకిలిలో కూరుకుపోయిన కొంతమంది నాయకులను చూస్తున్నప్పుడు నీతివంతమైన నాయకులను కూడా అదే గట్టున చూసేస్తుంటారు కొందరు. ఒక మంచి ఉద్దేశంతో చెరువు ప్రాంతంలో వున్న భూమిని కొనుగోలు చేసి అక్కడ గోశాలను ఏర్పాటు చేసారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. వాస్తవానికి ఈ కోడిచెరువు 2014కి ముందే ఆయన కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో వుంది. దీనిపై ఇటీవల కొంతమంది రాద్దాంతం చేసారు.
ఆ చెరువును డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కబ్జా చేసారంటూ ఆరోపణలు చేసారు. ఐతే అది నిజం కాదని హైడ్రా కమీషనర్ సవివరంగా వివరణనిచ్చారు. పవన్ కల్యాణ్ గారి భూమి FTLలో వుండటం తప్పు కాదని అన్నారు. చెరువులో పట్టాభూమి వుండటం కూడా తప్పుకాదనీ, ఇలా చాలామంది వ్యక్తులకు భూములు వున్నాయని వెల్లడించారు.
ఐతే చెరువులో ఫెన్సింగ్ వేయడం తప్పు అవుతుంది కానీ ఆ ఫెన్సింగ్ నీటి ప్రవాహానికి ఎలాంటి అడ్డంకి కలుగజేయడం లేదు కనుక అది కూడా తప్పు కాదని అన్నారు. ఇవన్నీ ఇంత వివరంగా చెప్పిన తర్వాత పవన్ కల్యాణ్ పైన విమర్శనాస్త్రాలు సంధించిన వారు తమ ముఖాలను ఎక్కడ పెట్టుకుంటారోనంటూ విమర్శిస్తున్నారు.
