సంబంధిత వార్తలు
- హైదరాబాదీ మహిళ అదుర్స్.. శ్రీలంక నుంచి ధనుష్కోడికి.. కొత్త రికార్డ్
- ఆ యువతికి నెలసరి అంటేనే నరకం.. కళ్లల్లో నుంచి రక్తం..?
- లాగి చెంపపై కొట్టిన తనయుడు... ఒక్క దెబ్బకు తల్లి మృతి.. ఎక్కడ?
- చూడు.. నీ కళ్లముందే.. నీ భార్యను రేప్ చేస్తాం.... మాజీ భర్త తమ్ముడి వికృతక్రీడ
- జొమాటో కేసు: ఆ యువతి పరారైందా? జొమాటో జోకులిక్కడ
అమ్మో.. ఆమె కడుపులో 20 రాళ్ళు.. ఒక్కో రాయి సైజు 20మి.మి
Kidney
వివరాల్లోకి వెళితే.. నస్రీన్ అనే యువతి రెండేళ్లుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో చికిత్సకోసం నిర్మల్, నిజామాబాద్, హైదరాబాద్‌లతోపాటు మహారాష్ట్రలోని నాందేడ్ వరకూ వెళ్లారు. అనేక ప్రైవేటు ఆసుపత్రులు తిరిగారు. సమస్య మాత్రం తీరలేదు.
చివరకు నిర్మల్ జిల్లా కేంద్రంలోనే దేవీబాయి ఆస్పత్రి వైద్యుడు అవినాశ్ కాసావార్‌ను కలిశారు. గాల్‌బ్లాడర్‌లో పెద్ద మొత్తంలో రాళ్లు ఉండటం వల్లే కడుపునొప్పి వస్తున్నట్లు ఆయన గుర్తించారు.
ఈ మేరకు శుక్రవారం ల్యాపరోస్కోపి విధానంలో ఆపరేషన్ చేయగా, ఆమె గాల్‌బ్లాడర్‌లో సుమారు 20 రాళ్లు, ఒక్కో రాయి సైజు 20 మి.మీ. ఉన్నవి బయటపడ్డాయి. ఇలాంటి అరుదైన ఆపరేషన్ జిల్లాలోనే తొలిసారిగా చేసినట్లు వైద్యుడు అవినాశ్ తెలిపారు.
