శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 19 మార్చి 2021 (22:50 IST)

హైదరాబాదీ మహిళ అదుర్స్.. శ్రీలంక నుంచి ధనుష్కోడికి.. కొత్త రికార్డ్

Smt G. Syamala
హైదరాబాదుకు చెందిన 47 ఏళ్ల మహిళ శభాష్ అనిపించుకుంది. 47 ఏళ్ల వయసులో శ్రీలంక తీరం నుంచి ధనుష్కోడికి 30 కి.మీ ఈతకొట్టి చేరుకుంది. తద్వారా కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన 47 ఏళ్ల శ్రీమతి జి. శ్యామల చరిత్ర సృష్టించారు. శ్రీమతి శ్యామల ఒక వ్యవస్థాపకురాలు. ఈ సముద్ర ఈత కోసం ఆమెకు సీనియర్ ఐపిఎస్ అధికారి రాజీవ్ త్రివేది శిక్షణ ఇవ్వడమేకాదు, మార్గనిర్దేశం కూడా చేశారు.
 
2012లో 12 గంటల 30 నిమిషాల్లో ఇదే జలసంధిని త్రివేది దాటారు. శ్రీమతి శ్యామల తన సక్సెస్ ఫుల్ జర్నీకోసం కొన్నేళ్ల క్రితం నుంచి త్రివేది దగ్గరే ఈత మెలుకువలు నేర్చుకుంటున్నారు. ఇప్పుడు అనుకున్నది సాధించిన ధీర మహిళగా చరిత్రకెక్కారు. 
 
ఆమె ఏం చేశారంటే.. ?
30 కిలోమీటర్ల మేర శ్రీలంక నుండి భారతదేశానికి జలసంధిలో విజయవంతంగా ఈదారు. సముద్రంలో ఇంత దూరం ఈత కొట్టిన తొలి తెలుగు మహిళగా రికార్డు క్రియేట్ చేయడమేకాదు, ప్రపంచంలో రెండవ మహిళగా నిలిచారు. శుక్రవారం తెల్లవారుజామున 4:15 గంటలకు శ్రీలంక తీరం నుంచి ప్రారంభమైన ఆమె, 13 గంటల 43 నిమిషాల పాటు నిరంతరంగా ఈత కొట్టిన తరువాత రామేశ్వరంలోని ధనుష్కోడికి చేరుకున్నారు.