షర్మిలను కలిసిన సానియా మీర్జా సోదరి, అజారుద్ధీన్ తనయుడు.. ఎందుకని?
వైయస్ షర్మిల తెలంగాణ రాజకీయ ఎంట్రీ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల వైయస్ మద్దతుదారులతో “ఆత్మీయ సమ్మేళనం” పేరట సమావేశమవుతున్నారు. అదే రీతిలో తెలంగాణలో ప్రముఖులతో కూడా భేటీ అవుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఇతర పార్టీలకు చెందిన నాయకులు షర్మిల పార్టీలో జాయిన్ అవుతున్నట్లు స్పష్టం చేయడం జరిగింది.
ఇలాంటి తరుణంలో లోటస్ పాండ్‌లో షర్మిలతో తెలంగాణలో టాప్ మోస్ట్ క్రీడా నేపథ్యం కలిగిన ఫ్యామిలీలు భేటీ అయ్యాయి. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ నగరానికి చెందిన టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సోదరి అనం మిర్జా అదేవిధంగా మాజీ క్రికెటర్ భారత క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్ కొడుకు అసదుద్దీన్ శుక్రవారం షర్మిలతో భేటీ అయ్యారు. దీంతో ఈ వార్త తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపుతోంది.
మోటివేషనల్ స్పీకర్ షఫీ అదేవిధంగా సానియా మిర్జా సోదరి, అజారుద్దీన్ కొడుకు ఇలా చాలా మంది ప్రముఖులు షర్మిల తో భేటీ అవుతూ ఉండటంతో రాజకీయంగా ఆమె.. వేస్తున్న అడుగులు సంచలనాలకు తెర లేపుతున్నాయి.