గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 19 మార్చి 2021 (08:08 IST)

లాగి చెంపపై కొట్టిన తనయుడు... ఒక్క దెబ్బకు తల్లి మృతి.. ఎక్కడ?

పార్కింగ్ గొడవ ఓ తల్లి ప్రాణం తీసింది. బలంగా తల్లి చెంపపై కొడుకు కొట్టడంతో ఆమె అక్కడే కుప్పకూలి కిందపడిపోయింది. ఇదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడంతో ఈ వ్యవహారం బయటకు పొక్కింది. ఢిల్లీలోని ద్వార్కా ప్రాంతంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన  ఈ వివరాలను పరిశీలిస్తే, పొరుగింటి వారితో పార్కింగ్ విషయంలో ఓ కుటుంబానికి గొడవ వచ్చింది. దీని గురించి మాట్లాడటం కోసం ఆ ఇంటికి వెళ్లిన సమయంలో 76 ఏళ్ల వృద్ధురాలు, ఆమె కుమారుడు రణ్‌బీర్, కోడలు శుద్రా బిస్త్ రోడ్డుపై నిలబడి వాదించుకున్నారు. 
 
ఈ సమయంలో మాటల మధ్య ఆగ్రహం తెచ్చుకున్న రణ్‌బీర్.. తన ముసలి తల్లిని బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు అలానే నేలపై పడిపోయిన ఆమె చలనం లేకుండా ఉండిపోయింది. రణ్‌బీర్ చేసిన ఘనకార్యం అక్కడి సీసీటీవీ ఫుటేజిలో రికార్డవడంతో వారు చేసిన ఘోరం బయటపడింది. 
 
సమాచారం అందుకున్న పోలీసులు... అక్కడకు వచ్చిన కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా, నేలపై పడి చలనం లేకుండా ఉన్న వృద్ధురాలిని శుద్రా దంపతులు ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అయితే అక్కడకు వెళ్లేసరికే ఆ ముసలి ప్రాణం గాల్లో కలిసిపోయినట్లు వైద్యులు ప్రకటించారని దర్యాప్తులో వెల్లడైంది.