సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 17 మార్చి 2021 (16:02 IST)

కర్నాటక మంత్రి రాసలీలల కేసు: యువతి ఆచూకీ లేదు, సూసైడ్ చేస్కుంటానంటూ వీడియో

కర్నాటక మంత్రి రాసలీలల కేసు ట్విస్టులపై ట్విస్టుల్లా నడుస్తోంది. మంత్రి జార్కిహోలి తనకు ఆ వీడియోతో ఎలాంటి సంబంధం లేదని తేల్చేసారు. ఎవరో మార్ఫింగ్ చేసి ఆ వీడియోను వదిలారంటూ ఆరోపించారు.
 
మరోవైపు రాసలీలల వీడియోలో కనబడిన యువతి తన తల్లిదండ్రులతో ఫోనులో మాట్లాడింది. టీవీలో వీడియో చూసినప్పుడు తండ్రి ఆమెను కాంటాక్ట్ చేసాడు. టీవీలో ఓ వీడియో వస్తోందనీ, ఆ వీడియోలో కనబడుతున్న యువతి అచ్చం నీలాగే వుందంటూ ఫోన్ చేసారు. దాంతో ఆ యువతి అందులో కనబడేది నేను కాదనీ, నేను ఏ తప్పు చేయలేదని చెప్పింది. మరోసారి కాల్ చేసి... నేను క్షేమంగానే వున్నాను, నన్ను కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నించవద్దని చెప్పి ఫోన్ స్విచాఫ్ చేసింది.
 
ఆ తర్వాత ఆమె ఆచూకీ లేదు. గత వారం సదరు యువతి తన ప్రాణాలకు ముప్పు వుందనీ, ప్రభుత్వం తనకు రక్షణ కల్పించాలనీ, లేదంటే తను ఆత్మహత్య చేసుకుంటానంటూ వీడియో పంపింది. ఆ వీడియోను ప్రసారం చేయడంతో తన పరువు పోయిందనీ, తన కుటుంబ సభ్యులు ఇప్పటికే రెండుసార్లు ఆత్మహత్య యత్నం చేసారనీ, నేను మూడునాలుగుసార్లు సూసైడ్ అటెంప్ట్ చేసినట్లు వీడియోలో తెలిపింది. దీనితో ప్రత్యేక దర్యాప్తు బృందం పోలీసులు ఈ కేసు గురించి దర్యాప్తును తీవ్రతరం చేసారు.