శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 11 మార్చి 2021 (12:45 IST)

మత్తులో వున్నప్పుడు నీపై అత్యాచారం చేశా, ఇవిగో ఫోటోలు: యువతి షాక్

సాయం చేసేందుకు డబ్బు ఇచ్చి, ఆ డబ్బు తిరిగి అడిగినందుకు ఓ యువకుడు హైదరాబాదులోని ఫిలింనగర్ మహాత్మాగాంధీ నగర్‌లో తన గదిలో అత్యాచారానికి పాల్పడ్డాడు. అది కూడా ఆమె డబ్బు అడిగేందుకు ఇంటికి వస్తే.. మాయమాటలు చెప్పి పూటుగా మద్యం తాగించాడు. ఆమె మత్తులోకి జారుకోగానే అత్యాచారం చేశాడు.
 
పూర్తి వివరాల్లోకి వెళితే... బీదర్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ యువతి నగరంలో ఉద్యోగం కోసం వేచి చూస్తోంది. ఈ క్రమంలో తన పిన్ని వరసయ్యే మరో మహిళ కుమారుడు కూడా ఫిలిం నగర్ లో వుంటూ రాయదుర్గంలో టైలరింగ్ పని చేస్తున్నాడు. తనకు డబ్బు అవసరం వుందని, రూ. 50 వేలు ఇవ్వాలంటూ ఆ యువతి కళ్లావేళ్లా పడ్డాడు. దాంతో ఆమె డబ్బు సమకూర్చింది. డబ్బిచ్చి నెలలు గడుస్తున్నా అతడు పైకం ఇవ్వడంలేదు.
 
మార్చి 1వ తేదీన నేరుగా అతడి గదికి వెళ్లి డబ్బు అడిగింది. సరే చూద్దాంలే.. అంటూ ఆమెకి మాయమాటలు చెప్పి పూటుగా మద్యం తాగించాడు. ఆమె మద్యం మత్తులోకి జారుకోగానే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇదేమీ ఆమెకి తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచిన ఆమె తన ఇంటికి వెళ్లిపోయింది.
 
మళ్లీ ఫోన్ చేసి అతడిని డబ్బు అడిగింది. దీనితో అతడు ఆమెతో సన్నిహితంగా వున్న ఫోటోలను వాట్సప్ ద్వారా షేర్ చేసాడు. మళ్లీ అతడే ఫోన్ చేసి.. మత్తులో వున్నప్పుడు నేను నీపై అత్యాచారం చేశాను. మళ్లీ డబ్బులంటూ అడిగితే ఫోటోలతో సహా ఆ వీడియోను కూడా నెట్లో పెడతానంటూ బెదిరించాడు. దీనితో షాక్ తిన్న యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసారు.