శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 11 మార్చి 2021 (12:20 IST)

"ఇస్మార్ట్ బ్యూటీ"కి లైఫ్ ఇవ్వనున్న పవన్ కళ్యాణ్?

ఇస్మార్ట్ శంకర్ చిత్రం ద్వారా మంచి పాపులర్ అయిన హీరోయిన్ నిధి అగర్వాల్. ఈమె గతంలో అక్కినేని నాగచైతన్య నటించిన సవ్యసాచి చిత్రం ద్వారా టాలీవుడ్ వెండితెరకు పరిచయమైంది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.
 
అయితే ఈ సినిమాలో నిధి అగర్వాల్ పర్ఫార్మెన్స్ బావుందన్న టాక్ రావడంతో వెంటనే అక్కినేని అఖిల్‌తో నటించే అవకాశం అందుకుంది. ఈ సినిమా కూడా ఆశించినంతగా సక్సస్‌ని సాధించలేకపోయింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు అక్కినేని సోదరులతో చేసిన నిధికి సక్సస్ దక్కకపోయినా పూరి జగన్నాధ్ సినిమాలో అవకాశాన్ని తెచ్చిపెట్టాయి. 
 
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన "ఇస్మార్ట్ శంకర్" సినిమాలో నభా నటేష్‌తో పాటు నిధి అగర్వాల్ కూడా హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో నిధికి వరసగా టాలీవుడ్‌లో అవకాశాలు వస్తాయని నమ్మకంతో ఉంది.
 
కానీ నిధి అగర్వాల్ అనుకున్నట్టుగా అవకాశాలు రాలేదు. గల్లా అశోక్ డెబ్యూ సినిమాలో హీరోయిన్‌గా చేస్తున్నప్పటికి ఆ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో.. ఎప్పుడు రిలీజవుతుందో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. తెలుగులో ఈసినిమా తప్ప మరొక సినిమా లేకపోవడంతో నిధీ అగర్వాల్‌కి టాలీవుడ్‌లో లక్ లేదనుకున్నారు. 
 
ఇదేసమయంలో వరసగా రెండు తమిళ సినిమాలు చేయడంతో కోలీవుడ్‌కి మకాం మార్చేస్తుందని చెప్పుకున్నారు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చూపు నిధి అగర్వాల్‌పై పడింది. దీంతో ఆమె ఫేట్ ఒక్కసారిగా మారిపోనుంది. క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమాలో నిధి అగర్వాల్ ఒక హీరోయిన్‌గా ఎంపికైంది. 
 
ఇలా అవకాశం ఇచ్చి నిధిని ఆదుకున్న పవర్ స్టార్.. సినిమా బ్లాక్ బస్టరయితే లైఫ్ ఇచ్చినట్టే అని చెప్పుకుంటున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ "గబ్బర్ సింగ్" సినిమా ద్వారా ఐరెన్ లెగ్‌గా ముద్రపడిన శృతి హాసన్‌కి మంచి లైఫ్ ఇచ్చిన సంగతి తెల్సిందే.