శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

అన్నే కదా అని ఇంటికెళితే మత్తు పెట్టి వివస్త్రను చేసి నగ్నవీడియోలు తీశాడు...

హైదరాబాద్ నగరంలో ఓ యువతి పట్ల వరుసకు అన్న అయ్యే ఓ కామాంధుడు అసభ్యంగా ప్రవర్తించాడు. డబ్బులు ఇచ్చిన పాపానికి.. ఆ యువతిని వివస్త్రను చేసి నగ్న వీడియోలు తీసి బెదిరిస్తూ పైశాచికానందం పొందాడు. చివరకు బాధిత యువతి పోలీసులను ఆశ్రయించండంతో ఆ కామాంధుడు ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు.
 
హైదరాబాద్, జూబ్లీ హిల్స్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బీదర్‌ ప్రాంతానికి చెందిన ఓ యువతి(26) నగరంలో ఉంటూ ఉద్యోగాన్వేషణ చేస్తోంది. కర్ణాటకలో ఉండే యువతి చిన్నమ్మకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు నిఖిల్‌(27) ఫిలింనగర్‌ పరిధి మహాత్మాగాంధీ నగర్‌ సమీపంలో నివసిస్తూ రాయదుర్గంలో టైలరింగ్‌ చేస్తున్నాడు. 
 
వ్యక్తిగత అవసరాల కోసం ఆ యువతి నుంచి రూ.50 వేలు తీసుకున్నాడు. ఈనెల ఒకటిన నిఖిల్‌ ఇంటికి వెళ్లింది. అపుడు ఆ యువతికి మత్తు కలిపిన శీతలపానీయం ఇచ్చాడు. దాన్ని సేవించిన యువతి అపస్మారక స్థితిలోకి జారుకుంది. ఆ తర్వాత ఆ యువతిని వివస్త్రను చేసి నగ్నంగా ఫోటోలు వీడియోలు తీశాడు. పైగా, తాను కూడా ఆ యవతి పక్కలో పడుకుని సన్నిహితంగా ఉన్నట్టు ఫోటోలు తీశాడు. 
 
మరుసటి రోజు నిద్రలేచిన ఆ యువతి నేరుగా తన ఇంటికి వెళ్ళిపోయింది. 4వ తేదీన డబ్బులు అడిగేందుకు నిఖిల్‌కు ఫోన్‌ చేసింది. తాను డబ్బులు ఇవ్వనని, నిద్ర పోయినప్పుడు ఇద్దరు కలిసి ఉన్నట్లు తీసిన ఫొటోను వాట్సాప్‌ ద్వారా ఆమెకు పంపాడు.
 
దీంతో కంగుతిన్న యువతి వెంటనే ఫోను చేయగా, 1వ తేదీన అత్యాచారం చేశానని, ఎవరికైనా చెబితే ఫొటోలు, వీడియోలు బయటపెడతానని బెదిరించాడు. మంగళవారం రాత్రి ఆ యువతి బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.