హైదరాబాద్ చేరుకున్న `ఆచార్య`
Acharya, chiru
ఇటీవల ఖమ్మం షెడ్యూల్ తో చిత్రబృందం బిజీగా ఉంది. ఈ షెడ్యూల్ లో చిరంజీవి- రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. తాజాగా ఈ షెడ్యూల్ విజయవంతంగా పూర్తయిందని నిర్మాతలు వెల్లడించారు. నిర్మాతల్లో ఒకరైన నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ-``ఖమ్మం షెడ్యూల్ ని ఎలాంటి ఆటంకాల్లేకుండా సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసి తిరిగి హదరాబాద్ లో అడుగుపెట్టాం. చిరంజీవి, చరణ్ పై కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరించాం`అని తెలిపారు. ఈ సినిమా మే 13న థియేటర్లలోకి రానుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
