గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 10 మార్చి 2021 (17:30 IST)

భిన్న‌మైన క‌థ‌ల ఎంపిక ఆయ‌న వ‌ల్లే తెలిసిందిః హీరో శ్రీ విష్ణు

Sri Vishnu
న‌టుడిగా నిరూపించుకోవాలంటే తొలినాళ్ళ‌లో పాత్ర‌ల‌కోసం ప్రాకులాడాల్సిందే. అలా తొలి నాళ్ళ‌లో కొన్ని సినిమాలు చేసి త‌న‌కంటూ ప్ర‌త్యేక ముద్ర ఆపాదించుకున్నాడు శ్రీ విష్ణు. `అప్ప‌ట్లోఒక‌డుండేవాడు, నీది నాది ఒకే క‌థ‌, మెంట‌ల్ మ‌దిలో, బ్రోచెవారెవ‌రురా` వంటి చిత్రాల‌తో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయ‌న తాజాగా చేసిన సినిమా `గాలి సంప‌త్`. రాజేంద్ర‌ప్ర‌సాద్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రమిది. అనిల్ రావిపూడి స‌మ‌ర్పకుడిగా వ్యవ‌హ‌రిస్తూ స్క్రీన్‌ప్లే, ద‌ర్శక‌త్వ ప‌ర్యవేక్షణ చేశారు. ఎస్. క్రిష్ణ నిర్మాత‌గా  అనీష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా శుక్ర‌వార‌మే విడుద‌ల‌కానుంది. ఈ సంద‌ర్భంగా శ్రీ‌విష్ణుతో ఇంట‌ర్వ్యూ.
 
క‌థ‌ల‌ను మీరు సెల‌క్ట్ చేసుకుంటున్నారా లేదా మీ కోస‌మో మంచి క‌థ‌లు రాస్తున్నారా?
ఇది వ‌ర‌కు నేను క‌థ‌ల కోసం ప‌రిగెత్తే వాడిని ఇప్పుడు మంచి మంచి క‌థ‌లు నా ద‌గ్గ‌ర‌కి వ‌స్తున్నాయి. చాలా హ్యాపీగా ఉంది.
 
గాలి సంప‌త్ అలా మొద‌ల‌యిందేనా?
అనిల్ రావిపూడిగారు ఫోన్ చేసి ఒక సారి నిన్నుక‌ల‌వాలి అని అన్నారు. స‌రే రమ్మ‌న్నారు క‌దా అని వెళ్లాను. ఈ సినిమా పాయంట్ చెప్పారు. ఎలా ఉంది నీకు న‌చ్చితే చేద్దాం అన్నారు. చాలా బాగుంది.. నేను రెడీ అని చెప్పాను. త‌ర్వాత డైరెక్ట‌ర్‌, టెక్నీషియ‌న్స్ని సెట్ చేసి పిలుస్తా అని చెప్పారు. ఫాద‌ర్ క్యారెక్ట‌ర్ ఎవ‌రు చేస్తున్నారు అని అడ‌గ‌గానే రాజేంద్ర ప్ర‌సాద్ గారు అని చెప్పారు. అప్పుడే ఈ సినిమా ఎలా ఉండ‌బోతుంది అని ఒక ఐడియా వ‌చ్చింది.
 
సెట్లో రాజేంద్ర ప్ర‌సాద్, మీ మధ్య చ‌ర్చ‌లు ఎలా ఉండేవి?
నేను ఒక సారి రెడీ అయ్యి షూటింగ్లోకి ఎంట‌ర్ అయ్యాక నా ప‌ని నేను చేసుకుంటాను. షూటింగ్ ఎక్కువ భాగం ఔట్‌డోర్లో జ‌ర‌గ‌డం వ‌ల్ల బ్రేక్‌లో రాజేంద్ర ప్ర‌సాద్గారి ద‌గ్గ‌రినుండి స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకునేవాడిని. ఆయ‌నా చాలా బాగా చెప్పేవారు. 90వ ద‌శ‌కంలో ఒకే సంవ‌త్స‌రం 12 సినిమాలు చేశారు. అందులో 8సినిమాలు వంద‌రోజులు ఆడాయ‌ని చెప్పారు. అన్ని పాత్ర‌లు ఎలా సెల‌క్ట్ చేసుకునేవారు, ఎలా చేసేవారు? ఇలాంటి ప్ర‌శ్న‌లు ఆయ‌న్ని అడిగిన‌ప్పుడు చాలా గొప్పగా స‌మాధానాలు చెప్పేవారు.  ఆయ‌న‌ని  క‌లిసిన త‌ర్వాత డిఫ‌రెంట్ క‌థ‌లు ఎలా ఎంపిక చేసుకోవాలి అనేదానికి చాలా హెల్ప్ అయ్యింది. ఈ క్యారెక్ట‌ర్ కోసం ఎలాంటి ఇన్‌పుట్స్ తీసుకోవాల్సిన అవ‌స‌రం రాలేదు. చాలా ఈజీగా చేయ‌గ‌లిగాను. దాదాపు ప్ర‌తి షాట్ సింగిల్ టేక్‌లోనే చేశాను.
 
సంగీత ద‌ర్శ‌కుడిగా అచ్చు రాజ‌మ‌ణిని ఎంచుకోవ‌డానికి కార‌ణం?
అచ్చు తమిళ్‌లో ఒక పాట చేశాడు. అది నాకు ప‌ర్స‌న‌ల్‌గా బాగా న‌చ్చింది. ఈ టీమ్ కూడా విని బాగుంది అన్నారు. ఆయ‌న్ని మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా పెడ‌దాం లేదా ఆ పాట యాజ్ఇట్ఈజ్ గా పెడ‌దాం అని వారికి చెప్పాను. వారు స‌రే మ్యూజిక్ అచ్చుతోనే చేపిద్దాం అన్నారు. అలా అచ్చుని సంగీత ద‌ర్శ‌కుడిగా తీసుకున్నాం. ఆ పాట‌తో  పాటు ఈ సినిమాలో ఫాద‌ర్ ఎమోష‌న్స్‌తో `ఫీ ఫీ ఫీ` సాంగ్ కూడా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కుదిరింది.
 
తండ్రి కొడుకుల క‌థ‌లో ఒక అమ్మాయికి ఎంత స్కోప్ ఉంటుంది?
ఈ సినిమాలో కోర్ ఎమోష‌న్ మాత్ర‌మే ఫాద‌ర్ అండ్ స‌న్ మీద ఉంటుంది. మిగ‌తా పార్ట్ ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుంది. ల‌వ్‌లీ సింగ్ కొత్త అమ్మాయి. చాలా బాగా చేసింది. త‌న క్యారెక్ట‌రైజేష‌న్ త‌ప్ప‌కుండా ఆడియ‌న్స్‌కి న‌చ్చుతుంది.
 
ఇంటిలో మీ త‌ల్లిదండ్రుల‌‌తో ఎలా ఉంటారు?
ఇప్ప‌టి వ‌ర‌కూ నేను ఏ ప‌ని చేసిన ఎప్పుడూ ప్ర‌శ్నించ‌లేదు. నేను ప్ర‌తీది వారికి చెప్పే చేస్తాను. చిన్న‌ప్ప‌టినుంచి నువ్వు అది చేయి ఇది చేయి అని ఎప్పుడూ ఒత్తిడి పెట్ట‌లేదు. నా మీద ఒక న‌మ్మ‌కం ఉంది. అందుకే మ‌న ఇంట్లో ఉండే ఎమోష‌న్స్ ఎక్కువ ఉన్న సినిమాలే ఎక్కువ‌గా చేస్తూ వ‌చ్చాను. దానికి మా ఫ్యామిలీ మెంబ‌ర్స్‌తో ఎక్కువ క‌నెక్ట్ అయి ఉండ‌డం కూడా ఓ కార‌ణమేమో.
 
ఈ క‌థ అనిల్ కాకుండా వేరే డైరెక్ట‌ర్ వ‌చ్చి చెప్పుంటే సినిమా చేసేవారా?
బేసిక్‌గా ఈ క‌థ నేను అనిల్ రావిపూడి గారి జోన‌ర్‌కి వెళ్ల‌డం కాదండీ.. ఆయ‌నే నా జోన‌ర్‌కి వ‌చ్చి త‌యారు చేసిన క‌థ‌. నాకు సెట్ అయ్యే క‌థే.. కాబ‌ట్టి డెఫినెట్‌గా చేసేవాడిని.  అలాగే ఈ సినిమా చాలా మంది వేరే భాష‌ల్లో రీమేక్ చేస్తార‌ని అనుకుంటున్నాను. ఒక వేళ నాకు అవ‌కాశం ఉంటే మ‌రో 20 సంవ‌త్స‌రాల త‌ర్వాత రాజేంద్ర ప్ర‌సాద్‌గారి పాత్ర నేనే పోషించి ఈ సినిమా రీమేక్ చేస్తాను.
 
త‌దుప‌రి చిత్రాల గురించి?
ప్ర‌స్తుతం `రాజ‌రాజ‌చోర` సినిమా విడుద‌ల‌కి సిద్దంగా ఉంది. త‌ర్వాత `అర్జున‌ఫ‌ల్గున` సినిమా 60% షూట్ కంప్లీట్ అయింది. త‌ర్వాత ఒక కొత్త ద‌ర్శ‌కుడితో పోలీస్ ఆఫీస‌ర్ బ‌యోపిక్‌ చేస్తున్నాను. అలా‌గే నా ఫ‌స్ట్ మూవీ `బాణం` డైరెక్ట‌ర్‌తో మ‌రో మూవీ చేస్తున్నాను. ఈ ఏడాది క‌చ్చితంగా మూడు సినిమాలు విడుద‌ల‌వుతాయి.