శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 9 మార్చి 2021 (17:02 IST)

చిన్న సినిమాలను తప్పకుండా ప్రొత్సహిస్తా: అనిల్ రావిపూడి

Anil Ravipudi, galisampath
`గ‌తంలో `పాపం ప‌సివాడు` సినిమా వ‌చ్చింది. ఎడాదిలో త‌ప్పిపోయిన ప‌సివాడి గురించి వెతికే క‌థ ఎంతో ఆక‌ట్టుకుంది. ఆ త‌ర‌హా సినిమాలు మ‌ళ్ళీ రాలేదు. ఆర‌కంగా పోల్చిచూస్తే ఈ చిత్రానికి పాపం పెద్దాయ‌న అని కూడా పిలుచుకోవ‌చ్చు. ఏదిఏమైనా `గాలి సంప‌త్‌` ఆ లోటు భ‌ర్తీచేస్తుంద‌ననీ, ఈ త‌ర‌హా సినిమాల‌కు నాంది చుట్ట‌బోతుంద‌ని భావిస్తున్నాన‌ని`` అనిల్ రావిపూడి అంటున్నారు.

ఎఫ్ 3 చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి స‌మ‌ర్పకుడిగా వ్యవ‌హ‌రిస్తూ స్క్రీన్‌ప్లే, ద‌ర్శక‌త్వ ప‌ర్యవేక్షణ చేస్తున్న‌‌ చిత్రం `గాలి సంప‌త్`. శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో న‌ట‌కిరీటి డా. రాజేంద్ర ‌ప్ర‌సాద్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. అనిల్ కో-డైరెక్టర్, రైట‌ర్, మిత్రుడు ఎస్. క్రిష్ణ నిర్మాత‌గా ఇమేజ్ స్పార్క్‌ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌ను స్థాపించి షైన్ స్క్రీన్స్‌తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనీష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ మార్చి11న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ఇంట‌ర్వ్యూ.
 
గాలి సంప‌త్ ఎలా మొద‌లైంది?
నా ఫ్రెండ్‌ ఎస్‌.కృష్ణ నా అన్నిసినిమాలకు రైటర్‌గా పని చేశాడు. నిర్మాతగా లాంచ్‌ అవ్వాలని తను గాలి సంపత్‌ కథ రాసుకున్నాడు. గాలి సంపత్‌ అని విని, గాలికి తిరిగే ఓ వ్య‌క్తి క‌థ ఏమో అనుకున్నాను. కాని నోట్లో నుంచి మాట రాకుండా కేవలం గాలిమాత్రమే వచ్చేలా గాలి సంపత్‌ క్యారెక్టర్‌ ఉంటుంది అనగానే నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అదీకాకుండా నేను ఇంగ్లీష్ ఫిలింస్ కొన్ని చూశాను. `కాస్ట్‌ అవే, లైఫ్ఆఫ్ పై. 127 అ‌వ‌ర్స్` ఇలాంటి జోన‌ర్‌లో తెలుగులో ఆ సెట్ ఆఫ్ ఫిలింస్ రాలేదు. అలాగే ఒక గొయ్యిలో పడిన వ్యక్తి ఎలా పైకి వస్తాడు? అన్న కాన్సెప్ట్ న‌న్ను ఎగ్జైట్ చేసింది. దాంతో ఒక‌ సమర్పకుడిగా నేను గాలిసంపత్‌ టీమ్‌తో ట్రావెల్‌ అయ్యాను. ఒక టీమ్‌ వర్క్‌లా గాలి సంపత్‌ను పూర్తి చేశాం. రేపు మార్చి 11న సినిమా విడుద‌ల‌వుతుంది.
 
అనీష్ ద‌ర్శ‌క‌త్వం ఎలా అనిపించింది?
దర్శకుడు అనీష్‌ చేసిన అలా ఎలా? సినిమా చూశాను నేను. అనీష్‌ సెన్సిబుల్‌ డైరెక్టర్‌. సెకాండాఫ్‌లో వచ్చే గొయ్యి సీన్స్, క్లైమాక్స్‌ సీన్స్‌లో చిత్ర యూనిట్‌ను డిస్ట్రబ్‌ చేయకుండా వారికి కావాల్సిన సహాయం చేశాను. నా ఫ్రెండ్‌ కృష్ణతో పాటు మరికొందరికి ఈ సినిమా తొలి సినిమా. అందుకే కాస్త ఎక్స్‌ ట్రా కేర్‌ తీసుకున్నాం.
 
ఈ సినిమాకు స్క్రిప్ట్ ప‌రంగా మీ గైడెన్స్ ఎంత వ‌ర‌కూ ఉంది?
స్క్రిప్ట్‌ పరంగా హెల్ప్‌ చేశాను. ముఖ్యంగా స్క్రీన్‌ ప్లే చూసుకున్నాను. అరకులోని హిల్‌ స్టేషన్‌లో జరిగే కథ ఇది. ఓ ఇంటి వెనక ఉన్న పాడుబడ్డ 30 అడుడుల బావిలో పడిన ఓ మాటలు రాని వ్యక్తి ఎలా భయటపడ్డాడు?. వర్షం పడినప్పుడు అతను ఎదుర్కొన్న పరిస్థితిలు ఏమిటీ? వాళ్లు ముందే ఆ బావిని ఎందుకు పూడ్చలేదు? అన్న అంశాల చూట్టూ గాలిసంపత్‌ కథ తిరుగుతుంది. ఈ సినిమాలో నేచ‌ర్‌కి సంబందించిన ఒక బిగ్ ఎలిమెంట్ ఉంది. రాజేంద్ర ప్ర‌సాద్‌, శ్రీ విష్ణు తండ్రీ కొడుకులుగా చేశారు. వారితో పాటు వ‌ర్షం కూడా ఒక పాత్ర పోషించింది. నేచ‌ర్ అనేది విల‌న్‌లాగా ఫీల‌య్యే ఈ మాట‌లు రాని వ్య‌క్తి ఆ నేచ‌ర్‌తో ఎలా ట్రావెల్ అయ్యాడు అనే ఒక బ్యూటిఫుల్ ఎలిమెంట్ ఉంది.
 
రాజేంద్రప్రసాద్, శ్రీ విష్ణు పాత్ర‌లు ఎలా ఉంటాయి?
ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్‌, శ్రీ విష్ణు తండ్రీకొడుకులు. తండ్రిది ఒక లక్ష్యం. కొడుకుది మరొక లక్ష్యం. రెండు వేరు వేరు దారులు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య చోటుచేసుకునే ఈగో క్లాషెష్‌నే గాలిసంపత్‌ కథ. రాజేంద్రప్రసాద్‌ ఎక్స్‌ట్రార్డినరీగా చేశారు. తండ్రి వల్ల ఇబ్బందులు పడే కొడుకు పాత్రలో శ్రీవిష్ణు యాక్ట్‌ చేశారు. బాగా చేశాడు. శ్రీ విష్ణుకు మంచి లవ్‌ట్రాక్ కూడా ఉంటుంది. తండ్రీకొడుకుల మధ్య దూరం పెరగడానికి ఈ లవ్ కూడా ఓ కారణం. ఇంత‌కు ముందు చెప్పిన‌ట్టు ఈ సినిమాలో వర్షం కూడ ఓ విలన్‌లా కనిపిస్తుంది. అదీ ఎలా అనేది సినిమాలో చూడండి. ఆడియన్స్‌ తప్పకుండా థ్రిల్‌ అవుతారనే నమ్మకం ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లలకు గాలిసంపత్‌ సినిమా ఇంకా బాగా నచ్చుతుంది.
 
మీ పేరు ఉంది కాబ‌ట్టి మీ గ‌త చిత్రాల్లాగే ఇది కంప్లీట్ ఎంట‌ర్‌టైన‌ర్ అనుకుంటారు క‌దా?
ఇది కంప్లీట్‌ ఎంటర్‌టైనర్‌ అని చెప్పను. ‘ఎఫ్‌2’లా ఉండదు. సినిమాలోని తొలిపార్టు సరదాగా ఉంటుంది. సెకండాఫ్‌లో మంచి ఎమోషన్స్‌ ఉంటాయి. ఇంతవరకు నేను విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేయలేదు. ఈ సినిమాకు అసోసియేషన్‌తో ఆ అనుభవం వచ్చింది. కాస్త కొత్తగా అనిపించింది. మాటలు రాని వ్యక్తి ఊహించని విధంగా గోయ్యిలో పడితే ఎలా ఉంటుంది? అతను ఎలా భయటకు వచ్చాడు? అన్న అంశాలను ఆడియన్స్‌ ప్రిపేరై వస్తే సినిమాను బాగా ఆస్వాదిస్తారు.

అందుకే ట్రైలర్‌లోనే ఆల్మోస్ట్ కథ చెప్పేశాము. ఈ సినిమా ఎక్కువమందికి రీచ్‌ కావడానికి వారి వెనక నేను నిలబడ్డాను. కథలో గ్రిప్‌ ఉంది. అందుకే ఎమోషన్స్‌ అండ్‌ థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ను కలిశాయి. వీటిని ఆసక్తికరంగా ఎలా డీల్‌ చేశామన్నది ఆడియన్స్‌ వెండితెరపై చూడాలి. నా ఫ్రెండ్‌, ఈ సినిమా నిర్మాత ఎస్‌.కృష్ణ కథ రాసుకున్నారు. క్యాస్ట్‌ అండ్‌ క్రూ ఎంపికను తనే చూసుకున్నాడు. నేను ఒక ఫ్రెండ్‌గా అతనికి సహాయం చేశాను అంతే.
 
మ్యూజిక్ డైరెక్ట‌ర్ అచ్చురాజ‌మ‌ణి గురించి?
ఈ సినిమాలోని ఆర్‌ఆర్‌ గురించి కాస్త టెన్షన్‌ పడ్డాను. ఎందుకంటే సెకండాఫ్‌లో రాజేంద్ర‌ప్రసాద్‌గారికి కంప్లీట్‌గా మాటలు రాన్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తోనే కథ ముందుకు వెళ్లాలి. కానీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ బాగా చేశారు. ఫైనల్‌ అవుట్‌పుట్‌ చూశాక నేను షాక్‌ అయ్యాను. అచ్చులో అంత టాలెంట్‌ ఉందా? అని నాకు అనిపించింది. అలాగే సత్య క్యారెక్టర్, కామెడీ టైమింగ్‌ బాగుంటుంది. రాజేంద్రప్రసాద్‌గారి క్యారెక్టర్‌కు డబ్బింగ్‌ చెబుతుంటాడు.
 
క‌థ, స్క్రీన్ ప్లే మీకు కొత్త కాదు. ఈ సినిమాకి సమర్పకుడిగా వ్య‌వ‌హ‌రించ‌డం ఎలా అనిపించింది?
దర్శకుడిగా వచ్చినప్పుడే హ్యాపీగా ఉన్నాను. సమర్పకుడిగా వచ్చినప్పుడు నిర్మాతకు ఉండే కష్టాలు తెలిశాయి. గాలిసంపత్‌ సినిమాకు సాహు, హరీష్‌లు బ్యాక్‌బోన్‌లా నిలిచారు. సినిమా పరంగా ఇప్పటివరకు అయితే నిర్మాతలు సేఫ్‌. తక్కువ బడ్జెట్‌లోనే కంప్లీట్‌ చేశాం. లెక్కలు చెప్పలేను. మిర్చి సినిమాలో ప్రభాస్‌గారు చెప్పినట్లు ‘మనం సేఫ్‌’ అన్నారు. సాహుగారితో ఓ సినిమా చేయాలని సుప్రీమ్‌ టైమ్‌ నుంచే అనుకుంటున్నాను. కానీ కుదర్లేదు. త్వరలో వారితో కూడా ఓ సినిమా చేస్తాను.
 
మీరు ఒక స్టార్ డైరెక్ట‌ర్ కదా..ఈ విధంగా చిన్న సినిమాల‌కు మీ ప్రోత్సాహం కంటిన్యూ అవుతుందా?
చిన్న సినిమాలను తప్పకుండా ప్రొత్సహిస్తాను. కంటెంటే పెట్టుబడి. నేను స్టార్ట్‌ అయ్యిందదే చిన్న సినిమాల నుంచి. కానీ ప్రజెంట్‌ అనిల్‌ రావిపూడి సినిమాలు అంటే ఆడియన్స్‌లో ఓ రకమైన ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉంటాయి. వాటిని బ్రేక్‌ చేయ కూడదు. టైమ్‌ వచ్చినప్పుడు నేను కూడా చిన్న సినిమాలను చేస్తాను.
 
‘ఎఫ్‌3’ అప్‌డేట్ ఏంటి?
‘ఎఫ్‌3’ షూటింగ్‌ 22 డేస్‌ చేశాం. ‘ఎఫ్‌ 2’ నచ్చిన వారంద‌రికీ ‘ఎఫ్‌ 3’ కూడా నచ్చుతుంది. ఇది ఎఫ్ 2కి సీక్వెల్‌ కాదు. ‘ఎఫ్‌ 2’ అనేది భార్యల గురించి ఫ్రస్ట్రేషన్‌ అయితే ఎఫ్‌ 3 డబ్బు గురించి ఫ్రస్ట్రేషన్‌. ఎఫ్ 2 కంటే మూడింత‌లు ఎక్కువ‌ న‌వ్విస్తుంది ఎఫ్‌ 3
 
మీ నెక్ట్స్ ప్రాజెక్ట్స్?
బాల‌కృష్ణగారితో సినిమా చేయాల‌ని చాలా సార్లు అనుకున్నాం..ఇంకా క‌న్ఫ‌ర్మ్ కాలేదు. మ‌హేష్ బాబుగారితో మ‌రో సినిమా డిస్క‌ర్ష‌న్ స్టేజ్‌లో ఉంది. అలాగే రామ్‌తో సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. వీటితోపాటు ఓ లేడీ ఓరియంటెడ్‌ స్పోర్ట్స్‌ ఫిల్మ్‌ చేద్దామనుకున్నాను. భవిష్యత్‌లో త‌ప్ప‌కుండా ఓ స్పోర్ట్స్‌ ఫిల్మ్‌ చేస్తాను.