అనిల్ రావిపూడి రిలీజ్ చేసిన`మడ్డీ` టీజర్
Muddy teaser
'మడ్డీ' టీజర్ రెసీ గా ఉంది. ముఖ్యంగా రవి బస్రూర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోరు, కె జీ రతీష్ సినిమాటోగ్రఫీ చాలా క్రిస్ప్‌గా ఉండి టీజర్‌ను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లాయి. ఈ టీజర్ చూస్తుంటే మడ్డీ చిత్రం ప్రేక్షకులను ఒక థ్రిల్లింగ్ రైడ్ కి తీసుకెళ్ళడం ఖాయంగా కనిపిస్తోంది. బురదలో సాగే రేసింగ్ తో సాహసోపేతమైన యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం ప్రేక్షకులకు అద్భుత అనుభవాన్ని అందించనుంది. టీజర్ తో సినిమా మీద ఆసక్తి, అంచనాలు మరింత పెరిగాయి.
దర్శకుడు ప్రగభల్ కి ఆఫ్ రోడ్ రేసింగ్ పట్ల ఉన్న ఆసక్తి, అనుభవం నుండే ప్రధానంగా మడ్డీ రూపొందింది. అయిదు సంవత్సరాల రీసెర్చ్ అనంతరం పక్కా స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని తీసిన ఈ సినిమా ప్రధానంగా రెండు వేర్వేరు జట్ల మధ్య శత్రుత్వం, ప్రతీకారం గురించి ఉన్నప్పటికీ ఫ్యామిలీ డ్రామా, హాస్యం, సాహసం ఇలా ప్రతి ఎమోషన్ ఈ మూవీలో ఉంటుంది. ఈ సినిమా కోసం ఆఫ్-రోడ్ రేసింగ్‌లో ప్రధాన నటులకు రెండేళ్లు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఆర్టిస్టులు ఏ డూప్ లేదా జూనియర్ స్టంట్ మేన్ లేకుండా సాహసోపేత సీన్స్, స్టంట్స్ చేయడం విశేషం.
