గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (17:01 IST)

'ఎవరు మీలో కోటీశ్వరుడు' అంటోన్న యంగ్ టైగర్..

జూనియర్ ఎన్టీఆర్ బుల్లితెరపై రీఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం అవుతోంది.  ''ఎవరు మీలో కోటీశ్వరుడు'' అనే టైటిల్‌తో ఈ షో తెరకెక్కనుంది. ఇందుకు హోస్టుగా చేయబోతున్నాడు యంగ్ టైగర్. అన్నపూర్ణ 7ఎకర్స్‌లో దీనికి సంబంధించిన ప్రోమో షూటింగ్ కూడా జరుగుతుంది. అందులో పాల్గొంటున్నాడు ఎన్టీఆర్. యంగ్ టైగర్‌పై త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రోమోస్ షూట్ చేస్తున్నాడు. 
 
ఓ ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్‌లో ఏప్రిల్ నుంచి ఈ ప్రోగ్రామ్ ప్రారంభం కానుంది. మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్‌ను ఎవరు మీలో కోటీశ్వరుడు అని పేరు మార్చి తీసుకొస్తున్నారు. మార్చి ఫస్ట్ వీక్ నుంచి షోకి సంబంధించి ఎంట్రీస్ తీసుకుంటారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ అంతా వేగంగా జరుగుతుంది. ట్రిపుల్ ఆర్ షూటింగ్ జరుగుతున్నా కూడా ఈషో కోసం కూడా కొన్ని డేట్స్ ఇచ్చాడు తారక్.
 
ఒక్కో ఎపిసోడ్ కోసం భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్. చాలా రోజుల కింద దీనిపై ఊహాగానాలు వచ్చాయి కానీ కరోనా కారణంగా షోపై అప్ డేట్స్ బయటికి రాలేదు. ఇప్పుడు పరిస్థితులు చక్కబడటంతో మళ్లీ షోకు మెరుగులు దిద్దుతున్నారు నిర్వాహకులు. 
 
ఎంటర్‌టైన్మెంట్ ప్లస్ నాలెడ్జ్ కూడా ఉండటంతో కచ్చితంగా ఈ షో మంచి సక్సెస్ అవుతుందని నమ్ముతున్నారు నిర్వాహకులు. దీనికోసం భారీగానే ఖర్చు చేస్తున్నారు. షోను కూడా భారీ స్థాయిలోనే లాంఛ్ చేయబోతున్నారు.