శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 14 ఫిబ్రవరి 2021 (17:32 IST)

అందాల ఆరబోతకు అడ్డు చెప్పని "పోరా పోవే" ఫేం..

ఈ మధ్యకాలంలో బుల్లితెర యాంకర్లు, నటీమణులు అందాల ఆరబోతకు ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. ఈ కోవలో టాప్ యాంకర్లు అనసూయ, రష్మి గౌతమ్, శ్రీముఖి ఇలా మరికొంతమంది ఉన్నారు. అలాగే, మరికొందరు బుల్లితెర నటీమణులు కూడా తామేం తక్కువకాదనేలా నడుచుకుంటున్నారు. 
 
తాజాగా బుల్లితెర యాంకర్ విష్ణు ప్రియ అందాల ఆర‌బోత‌కు అడ్డంకులేవని చెప్పేలా నడుచుకుంటోంది. రీసెంట్‌గా హృదయ అందాల‌తో హీటెక్కించిన ఈ ముద్దుగుమ్మ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా మరోసారి రెచ్చిపోయింది. వైట్ అండ్ బ్లాక్ డ్రెస్ మ‌ధ్య ఈ ముద్దుగుమ్మ అందాల‌ు ఆరబోసింది. 
 
ప్ర‌స్తుతం విష్ణు ప్రియ హాట్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కాగా, వీటిపై నెటిజ‌న్స్ స్ట‌న్నింగ్ కామెంట్స్ పెడుతున్నారు. "పోరా పోవే" ప్రోగ్రాంతో ఫేమ‌స్ అయిన విష్ణు ప్రియ ఈ మ‌ధ్య గ్లామ‌ర్ షోతో హాట్ టాపిక్‌గా మారుతుంది. విష్ణు న‌టించిన చిత్రం ఫిబ్ర‌వ‌రి 19న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.