రాజమౌళికంటే అనిల్ రావిపూడితోనే మహేష్ ఖరారు!
మహేష్‌బాబుకు సరిలేరు నీకెవ్వరు సినిమా హిట్ ఇచ్చాక మరలా అనిల్‌రావిపూడితో ఓ కథను సిద్ధం చేయమని చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట సినిమా దుబాయ్ షెడ్యూల్ ముగించుకుని వచ్చింది. మరలా షెడ్యూల్ గేప్ వుంది. ఈలోగా ఆయనకు రాజమౌళి గతంలో చెప్పిన కథ ఖరారైంది. అది చేయాలంటే ఆర్.ఆర్.ఆర్. పూర్తికావాలి. అది ఎప్పుడు అవుతుందో తెలీదు. అందుకే ఈలోగా మరో సినిమా చేయడానికి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అందులో భాగంగా అనిల్ రావిపూడి మరలా పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌తో కథను రాసుకుని మహేష్‌కు వినిపించేపనిలో వున్నారు. అన్నీ అనుకూలిస్తే ఈ ఏడాది సెట్‌పైకి వెళ్ళవచ్చు. వీరితోపాటు వంశీపైడిపల్లి కూడా ఓ కథను రెడీగా చేసుకున్నాడు. అయితే మహేష్ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఆయన పిలుపు కోసం ఎదురుచూస్తున్నట్లు ఫిలింనగర్ కథనాలు చెబుతున్నాయి.