శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 27 ఫిబ్రవరి 2021 (16:44 IST)

ఒకే ఒక కరోనా కేసు.. వారం రోజుల పాటు లాక్ డౌన్

కరోనా మహమ్మారి విజృంభించినప్పటి నుంచీ న్యూజిలాండ్ దానిని ఎలా నియంత్రించిందో మనకు తెలుసు. ఈ వైరస్ వ్యాప్తిని ఆ దేశం సమర్థంగా అడ్డుకుంది. అయితే తాజాగా న్యూజిలాండ్‌లో అతి పెద్ద నగరమైన ఆక్లాండ్‌లో ఒక కరోనా కేసు నమోదైంది. దీంతో ఆదివారం నుంచి ఆ నగరం మొత్తం వారం రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు ఆ దేశ ప్రధాని జెసిండా ఆర్డర్న్‌.
 
మిగతా దేశంలోనూ లెవల్ 2 నియంత్రణలు ఉంటాయని ఆమె తెలిపారు. అంటే ఎక్కువ మంది గుమిగూడే కార్యక్రమాలపై నిషేధం ఉంటుంది. ఈ మధ్యే యూకే వేరియంట్ కరోనా ముగ్గురికి సోకడంతో ఆక్లాండ్‌లో మూడు రోజుల లాక్‌డౌన్ విధించారు. ఇక అటు బ్రెజిల్ రాజధాని బ్రెజిలియాలోనూ 24 గంటల పాటు లాక్‌డౌన్ విధించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.