శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 8 మార్చి 2021 (15:19 IST)

రాజేంద్ర ప్రసాద్‌కి నేషనల్ అవార్డ్ పక్కా: హీరో రామ్

Gali samth pre release
శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం `గాలి సంప‌త్`. న‌ట‌కిరీటి డాక్టర్ రాజేంద్ర ‌ప్ర‌సాద్ టైటిల్ రోల్ పోషిస్తున్నఈ చిత్రానికి అనిల్ రావిపూడి స‌మ‌ర్పకుడిగా వ్యవ‌హ‌రించడంతో పాటు స్క్రీన్‌ప్లే, ద‌ర్శక‌త్వ ప‌ర్యవేక్షణ కూడా చేస్తుండ‌డం విశేషం. సాయి క్రిష్ణ నిర్మాత‌గా ఇమేజ్ స్పార్క్‌ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌ను స్థాపించి షైన్ స్క్రీన్స్‌తో క‌లిసి అనీష్  దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మార్చి 12న విడుదల కానున్న ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్‌ జేఆర్సీ కన్వెన్షన్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎనర్జిటిక్ అండ్ ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘మా బ్యానర్ స్టార్ట్ అయిందే రాజేంద్ర ప్రసాద్ గారు నటించిన ‘లేడీస్ టైలర్’ సినిమాతో. నా చిన్నప్పుడు ఆయన సినిమాలే ఎక్కువ చూసేవాడిని. ఆయన పేరు ముందు ఏ బిరుదు పెట్టినా అది చిన్నదిగానే కనిపిస్తుంది. ఈ సినిమాతో ఆయనకు నేషనల్ అవార్డు రావాలని కోరుకుంటున్నా. ఇది తప్పకుండా అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ అవుతుంది. శ్రీవిష్ణు చాలా సైలెంట్‌గా ఉంటాడు. చాలా జెన్యూన్ పర్సన్. ఈ సినిమా నిర్మాతలకు ఆల్ ది బెస్ట్.

ప్రొడ్యూసర్ కమ్ రైటర్ సాయి అద్భుతంగా రాసుకున్నారు. డైరెక్టర్ అనీష్‌కు మంచి సపోర్ట్ దొరికింది. అనిల్ రావిపూడి నాకు అసోసియేట్ డైరెక్టర్ నుంచి తెలుసు. అనిల్ నిజాయితీ నాకు బాగా నచ్చుతుంది. లాస్ట్ టైమ్ కమర్షియల్ సినిమా గురించి అనిల్‌తో డిస్కషన్ చేశా. జనాలు ఎక్కువ మాట్లాడకపోయినా ఎక్కువ చూసేది మాత్రం కమర్షియల్ సినిమాలే. తెలుగోడి కూరల్లో కారం తగ్గనంత వరకు, మన ఒంట్లో ఊపు తగ్గనంత వరకు, తెలుగు ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమా వేల్యూ తగ్గదు. అలాగే కమర్షియల్ డైరెక్టర్ వేల్యూ కూడా తగ్గదు. అనిల్ మంచి కమర్షియల్ డైరెక్టర్. అందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు.
 
శ్రీవిష్ణు మాట్లాడుతూ..‘‘నేను సినిమాల్లోకి డైరెక్టర్ అవుదామని వచ్చా. ఏవేవో కథలు రాసుకున్నా. నేను ఏ కథ రాసినా నా మైండ్‌లోకి వచ్చేది రామ్ గారు. ఆయన ఏ కథ అయినా చేయగలరు. గాలి సంపత్ సినిమా నా జీవితంలో ఒక అద్బుతమైన కథ. నేను చిన్నప్పుడు ఫస్ట్ చూసిన హీరో రాజేంద్ర ప్రసాద్ గారు. కరోనా టైమ్‌లో కూడా ప్రాణాలకు లెక్కచేయకుండా ఆయన యాక్ట్ చేశారు. ప్రపంచంలోనే గొప్ప నటుడి దగ్గర ఈ సినిమాలో నేను ట్రైన్ అయ్యా. నా నెక్ట్స్ సినిమాల్లో ఆ యాక్టింగ్ చూస్తారు. ఈ సినిమాలో క్లైమాక్స్ సీన్‌కు హార్ట్ ఉన్న ప్రతిఒక్కరూ చేతులెత్తి దండం పెడతారు. అంత అద్భుతంగా ఉంటుంది. ఇక అనిల్ రావిపూడి గారు మన చుట్టూ ఉంటేనే పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది.  ఈ సినిమాతో నాకు మంచి అన్నయ్య దొరికారు. సాయి కృష్ణ గారు చాలా మంచి ప్రొడ్యూసర్ అవుతారు అన్నారు.

Rajendra prasad, Ram
న‌న్ను నిలబెట్టిన మొదటి సినిమా లేడీస్ టైలర్
డాక్టర్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘గాలి సంపత్ సినిమా చూసిన తర్వాత రెండు మూడు నిజాలు నాకు అర్థమయ్యాయి. జీవితంలో మనం ఏం చేసినా భగవంతుడు మనకు ఇచ్చే అవకాశం అవకాశం రానిదే జీవితంలో ఎవరూ ఏమీ చేయలేరు అనేది నాకు తెలిసొచ్చింది. 44 ఏళ్ల సినీ జీవితం తర్వాత రామ్‌కు నాకు ఉన్న లింక్ ఏంటంటే.. నా జీవితంలో నన్ను నటుడిగా నిలబెట్టిన మొదటి సినిమా లేడీస్ టైలర్. ఆ సినిమాను నిర్మించింది స్రవంతి మూవీస్. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే అప్పటికి ఇంకా రామ్ పుట్టలేదు.

నేను జీవితంలో బతకడానికి కారణమైన సినిమా లేడీస్ టైలర్. ఆ సినిమా లేకపోతే నేను లేను. అందుకే రామ్ ఫాదర్‌కు చెప్పాల్సిన థ్యాంక్స్ రామ్‌కు చెబుతున్నా. ఇక సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో నా పాత్రను నేను జీవితాంతం గుర్తుంచుకునేలా ఎస్ కృష్ణ నా పాత్రను రాశారు. ఆయనను నిర్మాతను చేయడానికి సహకరించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి నన్ను ఆప్యాయంగా డాడీ అని పిలుస్తాడు. ఈ వయసుకే ఇంత మెచ్యూరిటీ వచ్చిందంటే డాడీగా నేను గర్వపడుతున్నా.

జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయని ఈ సినిమా చేశాక నాకు అర్థమైంది.  ఈ చిత్రంలో తండ్రీకొడుకులుగా నేను శ్రీవిష్ణు నటించాం అంటే ఎవరూ నమ్మరు. అంతలా జీవించాం. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ నాకు అద్భుతమైన కంపెనీ ఇచ్చారు. మా అందరినీ అనిల్ రావిపూడి అద్భుతంగా కోఆర్టినేట్ చేశారు. గాలి సంపత్ సినిమా నా జీవితంలో ఒక ఆణిముత్యం’’ అన్నారు.
 
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ..‘‘గాలి సంపత్ స్టోరీ విన్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఈ సినిమాలో ఇద్దరు హీరోలున్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు వన్ మ్యాన్ షోగా చేశారు. ఈ సినిమా ఆయన చుట్టే తిరుగుతుంది. ఇక శ్రీవిష్ణు చాలా  మంచి ఆర్టిస్ట్. ఎలాంటి పాత్ర అయినా చాలాబాగా చేస్తాడు. సాయికి ఆల్ ది బెస్ట్’’ అన్నారు.
 
అనిల్ రావిపూడి మాట్లాడుతూ..‘‘గాలి సంపత్ సినిమా నా బెస్ట్ ఫ్రెండ్ సాయి నా ఫ్యామిలీ మెంబర్ లాంటి వాడు. నా కష్టసుఖాల్లో ఎప్పుడూ ఉన్నాడు. సాయి మొండివాడు. తను అనుకున్నది చేసేవరకు నిద్రపోడు. నా సినిమాలకు నేను టెన్షన్‌గా ఉంటా. కానీ ఈ సినిమాకు రిలాక్స్‌గా ఉన్నా. అంత కాన్ఫిడెన్స్ ఉంది. చాలా కొత్త సినిమా చేశారు. ఈ సినిమాకి డైరెక్టర్‌గా పని చేసిన అనీష్ చాలా సెన్సిబుల్ డైరెక్టర్. తనకు కూడా ఈ సినిమా ప్లస్ అవ్వాలి. సాయికి నాకు ఈ సినిమా కోసం సపోర్ట్ చేయడానికి వచ్చిన హరీష్ పెద్ది, సాహు గారపాటి గారికి థ్యాంక్స్. ఈ నిర్మాతలతో నేను త్వరలో సినిమా చేయబోతున్నా.

గాలి సంపత్ సినిమాకు రాజేంద్ర ప్రసాద్ గారు ఫిక్స్ అయ్యాక కొడుకు పాత్ర ఎవరు అని అనుకున్నప్పుడు శ్రీవిష్ణుయే మాకు ఫస్ట్ ఆప్షన్ అయ్యాడు. ఈ సినిమాలో వాళ్లిద్దరూ నిజంగా జీవించారు. విష్ణు కెరీర్‌లో ఇదొక మంచి సినిమా అవుతుంది. ఇక నా డాడీ రాజేంద్ర ప్రసాద్ గారితో జర్నీ సుప్రీం మూవీ నుంచి స్టార్ట్ అయింది. ఒక్కో సినిమాకు ఒక్కో స్టైల్, మేనరిజమ్‌తో చేస్తారు. ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఆయనను కొట్టేవారే లేరు. డాడీ.. యుఆర్ ద లెజెండ్. మనం చిన్నప్పటి నుంచి ఎన్నో సినిమాలతో మనల్ని నవ్వించిన ఆయనకు సెలబ్రేషన్‌గా ఈ సినిమాను అందరూ చూడాలని కోరుకుంటున్నా. ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా వచ్చిన రామ్ గారికి థ్యాంక్స్అ న్నారు.