గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 19 మార్చి 2021 (13:05 IST)

ఆ యువతికి నెలసరి అంటేనే నరకం.. కళ్లల్లో నుంచి రక్తం..?

సాధారణంగా మహిళలకు నెలసరి అంటేనే ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయి. కడుపులో తీవ్రమైన నొప్పి రావడం, నీరసంగా ఉండటం, బలహీనంగా మారడం వంటి లక్షణాలు సదరు యువతులు, మహిళల్లో కనిపిస్తాయి. అయితే ఛంఢీగర్‌కు చెందిన 25ఏళ్ల యువతికి నెలసరి అంటేనే నరకం. ఆమె బాధ వర్ణానాతీతం. ఎందుకంటే.. నెలసరి సమయంలో ఆమె కళ్లలో నుంచి కన్నీళ్లు కారినట్లే రక్తం కారుతుంది. 
 
ఈ కేసును చూసి వైద్యులు షాక్‌కు గురయ్యారు. అయితే ఆమె కళ్లలో నుంచి రక్తం కారినప్పుడు ఎలాంటి నొప్పి, ఇతర సమస్యలు లేవని బాధిత యువతి స్పష్టం చేసింది. ఎందుకు కళ్లలో నుంచి రక్తం కారుతుందని వైద్యులు పరిశీలించగా.. అన్ని రిపోర్టులు సాధారణంగానే ఉన్నాయి. 
 
ఆక్యులర్ విస్కారియస్ మెనుస్ట్రేషన్ వల్లే ఈ సమస్య ఉత్పన్నమవుతుందని వైద్యులు నిర్ధారించారు. ఇలాంటి సమస్య ఉన్నప్పుడే యోని నుంచి కాకుండా ఇతర ఆర్గాన్స్ నుంచి రక్తం కారుతుందని వైద్యులు పేర్కొన్నారు. ఒక కళ్లే కాకుండా పెదవులు, ఊపిరితిత్తులు, కడుపు, ముక్కు నుంచి కూడా రక్తం కారే అవకాశం ఉందన్నారు.