సంబంధిత వార్తలు
- నా బిడ్డతో పాటు నేనూ చనిపోయా : విజయ్ ఆంటోనీ
- విష జ్వరమా లేక నిఫా వైరస్ సోకిందా? పెద్దపల్లిలో బాలిక అనుమానాస్పద మృతి
- టీచర్స్ డే : శిథిలావస్థలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చదువుకున్న పాఠశాల
- రష్యాలో కుప్పకూలిన విమానం... పుతిన్‌పై తిరుగుబాటు చేసిన వాగ్నర్ ఆర్మీ చీఫ్ ప్రిగోజిన్ మృతి
- నృత్యం చేస్తూ గుండెపోటుతో ఇంటర్ విద్యార్థిని మృతి
దసరా సెలవులకు ఇంటికొచ్చిన విద్యార్థిని గుండెపోటుతో మృతి
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో విషాదకర ఘటన జరిగింది. దసరా సెలవుల కోసం ఇంటికి వచ్చిన ఏడో తరగతి బాలిక ఒకరు గుండెపోటుతో చనిపోయారు. దీంతో ఆ బాలిక ఇంటితో పాటు గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పగా తల్లిదండ్రులు వెంటనే ఆ బాలికను ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో కన్నుమూశారు.
నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని సాంఘింక సంక్షేమ గురుకుల పాఠశాలలో కంజర గ్రామానికి చెందిన అదరంగి మైథిలి అనే బాలిక ఏడో తరగతి చదువుతుంది. ఆమె అక్క గ్రేసీ కూడా అక్కడే ఇంటర్ మొదటి సంవత్సరం విద్యాభ్యాసం చేస్తుంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది.
దీంతో అక్కా చెల్లెళ్లు ఇద్దరూ ఇంటికి వచ్చారు. అదేరోజు రాత్రి ఛాతిలో నొప్పిగా ఉందని మైథిలి తల్లికి చెప్పింది. దీంతో ఆమెను వెంటనే సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే ఆ బాలిక మృతి చెందినట్టు ధృవీకరించారు. గుండెపోటు కారణంగానే ఆ బాలిక చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించరు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదం అలముకుంది.
తర్వాతి కథనం
