శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: బుధవారం, 27 మే 2020 (14:39 IST)

నిన్ను వంటరిగా కలవాలని వుందని ప్రియురాలిని పిలిచి ఫ్రెండ్స్‌తో గ్యాంగ్ రేప్

రంగారెడ్డి జిల్లాలో స్టాఫ్ నర్స్ పైన దుండగలు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. నర్స్ ప్రియుడు భాను తన ఇద్దరు స్నేహితులతో కలసి సామూహిక అత్యాచారం చేసారు. అమ్మాయికి కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలపి గ్యాంగ్ రేప్ చేసారు. ఇంతకీ ఏం జరిగిందంటే... ప్రియుడు భాను తన ప్రియురాలుకి ఫోన్ చేసి నీతో ఒంటరిగా కలవాలి రమ్మన్నాడు.
 
ఎలికట్ట సమీపంలోని ఓ ఐరన్ పరిశ్రమ వెనుక నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్లాడు. పలుమార్లు ఆమెపై అత్యాచారం చేసాడు. అంతటితో ఆగకుండా తన స్నేహితులను అక్కడికి  పిలిపించాడు. 
 
తన స్నేహితుల కోరిక కూడా తీర్చాలంటూ ఆమెపై ఒత్తిడి చేసాడు. దానికి ససేమీరా అనడంతో కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలపి ఆమెకు బలవంతంగా తాగించి గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు ఆ  కామాందులు.
 
వారిని ప్రతిఘటించడానికి ప్రయత్నించడంతో ఆమెపై దాడికి పాల్పడ్డారు. దీంతో భాదితురాలికి తీవ్రగాయాలు అయ్యాయి. వారి నుండి తప్పించుకుని జరిగిన విషయాన్ని కుంటుంబ సభ్యులకు తెలిపింది. వెంటనే బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసి షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. తమకు న్యాయం చేయాలంటూ బాధితురాల బంధువులు డిమాండ్ చేస్తున్నారు.