మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 మే 2020 (14:39 IST)

కవల పిల్లలకు జన్మనిచ్చిన కరోనా పాజిటివ్ మహిళ

Twin Baby
కరోనా వైరస్ సోకిన మహిళ కవల పిల్లలకు కరోనా సోకింది. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో మరోసారి కరోనా సోకిన గర్భిణి పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్‌కు చెందిన గర్భిణికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఆమె గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. నెలలు నిండటంతో బుధవారం వైద్యులు ఆమెకి శస్త్రచికిత్స చేయడంతో కవల పిల్లలకు జన్మనిచ్చింది. 
 
తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ విషయమై గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ మాట్లాడుతూ.. శిశువులను తల్లినుంచి వేరు చేసి ఐసీయూలో ఉంచినట్లు తెలిపారు. తల్లికి నెగెటివ్‌ వచ్చాక శిశువులను తల్లివద్దకు చేర్చుతామని చెప్పారు. కాగా.. గతంలో కరోనా సమయంలో పుట్టే పిల్లలకు కరోనా, కోవిడ్ అని పేర్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే.