శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 మే 2020 (09:06 IST)

ఇండిగో విమానంలో కరోనా రోగి.... 129 మంది ప్రయాణికుల క్వారంటైన్

దేశంలో రెండు నెలల తర్వాత స్వదేశీ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈ విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులకు కఠినమైన స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నారు. అయిప్పటికీ.. అక్కడక్కడా కరోనా కేసులు బయపడుతున్నారు. తాజాగా చెన్నై నుంచి కోయంబత్తూరుకు వెళ్లిన ఓ ఇండిగో విమానంలో కరోనా రోగిని గుర్తించారు. దీంతో ఆ విమానంలో ప్రయాణించిన 129 మంది ప్రయాణికులను క్వారంటైన్‌కు పంపించారు. అలాగే, విమాన సిబ్బందిని కూడా క్వారంటైన్‌కు తరలించారు. 
 
రెండు నెలల తర్వాత దేశీయంగా విమానాల సేవలు మొదలు కాగా, కరోనా పాజిటివ్ వ్యక్తి ప్రయాణం సాగించడం కలకలం రేపింది. ఇండిగో 6ఈ 381 అనే నంబరు విమానంలో ఈ ఘటన జరిగింది. కోయంబత్తూరు ఎయిర్‌పోర్టులో దిగిన ప్రయాణికులను పరీక్షిస్తుండగా, చెన్నైలోని ఓ స్టార్ హోటల్‌లో పనిచేస్తున్న ఓ వ్యక్తికి పాజిటివ్ అని తేలింది.
 
వెంటనే అతన్ని కోయంబత్తూరులోని వినాయక్ హోటల్‌కు తరలించి నిర్బంధించిన అధికారులు, ఆపై ఈఎస్ఐ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం జాయిన్ చేశారు. అతనితో కలిసి ప్రయాణించిన వారందరికీ నెగటివ్ వచ్చినప్పటికీ, అందరినీ 14 రోజుల హోమ్ క్వారంటైన్‌కు తరలించారు.