కరోనా కేసుల్లో టాప్-10లో భారత్ - ఆ నాలుగు రాష్ట్రాల కారణంగానే...
దేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. రోజురోజుకూ వందల వేల సంఖ్యలో కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఈ కరోనా జోరుగు ఏమాత్రం బ్రేకులు లేకుండా పోతున్నాయి. ఫలితంగా ఈ నాలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో సగం కేసులు ఈ నాలుగు రాష్ట్రాల్లోనే నమోదైనవే కావడం గమనార్హం.
తాజా గణాంకాల మేరకు కరోనా కేసుల్లో భారత్ ప్రపంచ స్థాయిలో పదో స్థానానికి చేరింది. ప్రస్తుతం దేశంలో 1,38,845 కరోనా కేసులు నమోదైవున్నాయి. అలాగే, 4021 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 77103 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరంతా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఇదిలావుంటే, ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు అంటే 24 గంటల్లో 6977 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే, దేశంలో నమోదైన కేసులో మంగళవారం ఉదయం వరకు మహారాష్ట్రలో 50231 కేసులు నమోదైవుండగా, తమిళనాడులో 16277, గుజరాత్‌లో 14056, ఢిల్లీలో 13418 కేసుల చొప్పున నమోదైవున్నాయి.