నాగుపామును బామ్మ తోక పట్టుకుని లాక్కెళ్లి ఏం చేసిందంటే?
నాగుపాము కనిపిస్తే మనం జడుసుకుని ఆమడదూరం పారిపోతాం. అయితే ఓ బామ్మ మాత్రం ఆ పామును చేతబట్టుకుని విసిరికొట్టింది. ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఒడిశాకు చెందిన ఓ అటవీశాఖ అధికారి ట్విటర్‌లో ఈ వీడియోను పోస్టు చేసింది. ఈ వీడియో చూస్తే అందరూ షాక్ అవుతారు.
జనావాసాల్లో కొచ్చిన పెద్ద నాగుపామును, ఆ బామ్మ ఒంటి చేత్తో పట్టుకొని గబగబా నడుచుకుంటూ లాక్కెళ్లింది. దాన్ని ఊరి బయటకు తీసుకెళ్లి విసిరేసింది. ఇది ట్వీట్ చేసిన కొద్దిసేపటికే నెటిజన్ల నుంచి విశేష స్పందన వచ్చింది. బామ్మ ధైర్యానికి మెచ్చుకోవాలని కామెంట్లు పెడుతున్నారు. ఇది పోస్టు చేసిన రెండు గంటల్లోనే 15 వేల మంది వీక్షించారు.