1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. bomb threat to Hyderabad Metro

హైదరాబాద్ మెట్రోకు బాంబు బెదిరింపు.. ప్రయాణికుల పరుగోపరుగు

హైదరాబాద్ మెట్రో రైల్వే స్టేషన్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో ప్రయాణికులు ప్రాణభయంతో పరుగు పెట్టారు. గత నెల 29వ తేదీ నుంచి హైదరాబాద్ మెట్రో రైల్వే సేవలు అందుబాటులోకి వచ్చిన విషయం తెల్సిందే. ఈ నే

Hyderabad Metro
హైదరాబాద్ మెట్రో రైల్వే స్టేషన్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో ప్రయాణికులు ప్రాణభయంతో పరుగు పెట్టారు. గత నెల 29వ తేదీ నుంచి హైదరాబాద్ మెట్రో రైల్వే సేవలు అందుబాటులోకి వచ్చిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో నగరంలో అమీర్‌పేట్‌ మెట్రోస్టేషన్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. 
 
స్టేషన్‌లో బాంబు పెట్టినట్లు పోలీసులకు సమాచారం రావడంతో వెంటనే అప్రమత్తమయ్యారు. బాంబు నిర్వీర్య బృందాలు హుటాహుటిన స్టేషన్‌ వద్దకు చేరుకుని తనిఖీలు చేపట్టాయి. హైదరాబాద్‌ మెట్రోరైలును నవంబర్‌ 28న ప్రధాని మోడీ ప్రారంభించగా.. 29 నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. తొలిరోజే ఏకంగా 2 లక్షల మంది ప్రయాణించడం ద్వారా మెట్రోరైలు రికార్డు సృష్టించింది.
 
ఈ నేపథ్యంలో అమీర్‌పేట్ మెట్రో  రైల్వే స్టేషన్‌లో బాంబు కలకలం అందరినీ టెన్షన్ పెట్టింది. స్టేషన్‌లో అనుమానాస్పదంగా ఉన్న బ్యాగులో బాంబు ఉన్నట్లు అనుమానించారు. జనం టెన్షన్ పడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. బ్యాగ్‌ను చెక్  చేసిన పోలీసులు.. అందులో ఏమీ లేదని తేల్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చివరకు ఆ బ్యాగ్ స్టేషన్‌లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డుదిగా గుర్తించారు.
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
క్యాంపస్ ఇంటర్వ్యూలు : విద్యార్థికి రూ.1.40 కోట్ల ప్యాకేజీ