శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : ఆదివారం, 3 డిశెంబరు 2017 (11:17 IST)

హైదరాబాద్‌లో మెట్రో జోష్... ప్రయాణికులతో స్టేషన్లు కిటకిట

హైదరాబాద్‌ వాసులు మెట్రో జోష్‌లో మునిగిపోయారు. వీకెండ్ కావడంతో ప్రయాణికులతో మెట్రో రైళ్లతో పాటు.. మెట్రో స్టేషన్లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడిపోతున్నాయి.

హైదరాబాద్‌ వాసులు మెట్రో జోష్‌లో మునిగిపోయారు. వీకెండ్ కావడంతో ప్రయాణికులతో మెట్రో రైళ్లతో పాటు.. మెట్రో స్టేషన్లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడిపోతున్నాయి. హైదరబాద్‌లో మెట్రో రైల్ సేవలు గత నెల 28వ తేదీ మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభమైన విషయం తెల్సిందే. ఆ తర్వాత 29వ తేదీ బుధవారం ఉదయం నుంచి ఈ సేవలు భాగ్యనగరి వాసులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి.
 
దీంతో మెట్రో రైళ్లలో ప్రయాణించి జర్నీ అనుభూతిని పొందేందుకు హైదరాబాద్ నగర వాసులు పోటీపడుతున్నారు. దీనికితోడు వీకెండ్ కావడంతో ప్రయాణికులతో మెట్రో ట్రైన్స్, స్టేషన్లు కిటకిటలాడాయి. వరుసగా 4వ రోజూ మెట్రో ట్రైన్లలో రెండు లక్షల మంది వరకు జర్నీ చేశారు. మొదటి రోజు 2 లక్షల మంది ప్రయాణించగా.. రెండోరోజు లక్షా 60 వేల మంది.. మూడోరోజు లక్షన్నర మంది, 4వ రోజు 2 లక్షల 10వేలకు పైనే మెట్రో  జర్నీ చేసినట్టు అధికారులు చెబుతున్నారు.
 
స్టార్టింగ్, ఎండింగ్ స్టేషన్లైన మియాపూర్, నాగోల్ స్టేషన్ల దగ్గర, సికింద్రాబాద్, బేగంపేట్, ఉప్పల్ స్టేషన్లలో ప్రయాణికుదీల రద్దీ అధికంగా కనిపిస్తోంది. అమీర్ పేట ఇంటర్ చేంజ్ స్టేషన్ దగ్గర కూడా రద్దీ ఎక్కువ ఉంది. ఆదివారం కావడంతో రద్దీ మరింత ఎక్కువగా ఉంది. టికెట్ల కోసం క్యూ నిలబడకుండా చాలామంది స్మార్ట్ కార్డులు కొనుగోలు చేస్తున్నారు. మెట్రో స్టేషన్లతో పాటు టిక్కెట్ల కొనుగోలు కేంద్రాల వద్ద చిన్నచిన్న సమస్యలు ఎదురైనా వెంటనే పరిష్కరిస్తున్నారు. భద్రత పరంగానూ.. పోలీసు, ప్రైవేటు సెక్యూరిటీతో పాటు సీసీ కెమెరాలతో ఎప్పటికప్పుడు నిఘా పెట్టారు.