శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : గురువారం, 30 నవంబరు 2017 (10:22 IST)

మెట్రోకి భాగ్యనగరి వాసుల ఫిదా

హైదరాబాద్ మెట్రో రైల్ జర్నీకి భాగ్యనగరి వాసులు ఫిదా అయిపోయారు. బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చిన మెట్రో రైళ్ళలో ప్రయాణించేందుకు హైదరాబాద్ వాసులు పోటీపడ్డారు.

హైదరాబాద్ మెట్రో రైల్ జర్నీకి భాగ్యనగరి వాసులు ఫిదా అయిపోయారు. బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చిన మెట్రో రైళ్ళలో ప్రయాణించేందుకు హైదరాబాద్ వాసులు పోటీపడ్డారు. దీంతో అన్ని మెట్రో స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడిపోయాయి. తొలిరోజే సుమారు 2 లక్షల మంది వరకు ఈ రైళ్ళలో ప్రయాణించి, సరికొత్త అనుభూతిని పొందారు. 
 
అయితే, మొదటిరోజు కావడంతో ప్రయాణికులు ఎక్కువగా సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. అన్ని మెట్రో స్టేషన్లలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రతి స్టేషన్‌లో 64 సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేశారు. నాగోల్-మియాపూర్ మధ్య ప్రస్తుతం 14 రైళ్లను నడుపుతున్నారు. మున్ముందు వీటి సంఖ్యను మరింతగా పెంచనున్నారు. 
 
అంతేకాకుండా, రాబోయే రోజుల్లో మియాపూర్ నుంచి నాగోల్ వరకు ఒకే రైలు (డైరెక్ట్) నడపనున్నట్లు మెట్రో డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. అమీర్‌పేట్‌లో ఇంటర్ ఛేంజ్ లేకుండా ఒకే రైలులో ప్రయాణం సాగించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అమీర్ పేటలో రైలు మారటం అనేది కంపల్సరీ కాదని.. డైరెక్ట్ రైలు నడపటానికి కొన్ని రోజుల సమయం పడుతుందన్నారు. త్వరలో మెట్రో పాస్‌లు కూడా అందుబాటులోకి వస్తాయన్నారు.