సంబంధిత వార్తలు
- కరోనా వేగంగా విస్తరిస్తుంటే నెమ్మదిగా పరీక్షలేంటి? తెలంగాణ సర్కార్ పైన హైకోర్టు అసంతృప్తి
- త్వరలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్
- తెలంగాణలో సెలూన్లు, లాండ్రీలు, ధోబీఘాట్లకు విద్యుత్ ఉచితం
- తెలంగాణలో పంజా విసురుతున్న కరోనా, విషమంగా 979 మంది ఆరోగ్యం, ఆఖరి నిమిషంలో వస్తున్నారు
- వైసిపికి షాక్, అద్యక్ష పదవికి రాజీనామా చేసిన శ్రీకాంత్ రెడ్డి
తెలంగాణలో 2వేలకు చేరువలో కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. రోజు వారీ కేసులు 2వేలకు చేరువలో ఉన్నాయి. నిన్న రాత్రి 8గంటల వరకు 74,274 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 1,914 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో ఐదుగురు మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,734కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 285 మంది కోలుకున్నారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,03,299కి చేరింది. ప్రస్తుతం 11,617 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 6,634 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 393 కేసులు నమోదయ్యాయి..
తర్వాతి కథనం
