1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Huzurabad : TRS Candidate Gellu Srinivas Yadav get B Form

హుజురాబాద్ ఉప ఎన్నిక : తెరాస అభ్యర్థికి బి-ఫామ్

Huzurabad
తెలంగాణ రాష్ట్రంలోని హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ అక్టోబరు 30వ తేదీన జరుగనుంది. ఈ ఎన్నికల్లో అధికార తెరాస అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ పోటీ చేస్తున్నారు. ఆయనకు తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ బీ-ఫారం అందించారు. 
 
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందన్నారు. బీ-ఫారంతో వెళ్లి భారీ మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా హైదరాబాద్ వస్తావంటూ శ్రీనివాస్ యాదవ్‌ను కేసీఆర్ ఆశీర్వదించారు. 
 
హుజూరాబాద్ తెరాసకు కంచుకోట అని, అక్కడ వ్యక్తులుగా కాకుండా పార్టీ ఎదిగిందన్నారు. పార్టీకి ద్రోహం చేసిన వారికి అక్కడ చోటు లేదన్న కేసీఆర్… హైదరాబాద్ నగరంలో తెరాసది గెలుపని సర్వేలన్నీ చెబుతున్నాయని తెలిపారు. ఎన్నికల ప్రచార సభలో తాను కూడా పాల్గొంటానని కేసీఆర్ స్పష్టం చేశారు.
తర్వాతి కథనం
ఏడ్చినందుకు కూడా బిల్లు ఆస్పత్రి యాజమాన్యం