సంబంధిత వార్తలు
- 23 ఏళ్ల ప్రియుడి కోసం 41 ఏళ్ల వివాహిత తన భర్తను హత్య చేయమంది...
- మత్తులో వున్నప్పుడు నీపై అత్యాచారం చేశా, ఇవిగో ఫోటోలు: యువతి షాక్
- అన్నే కదా అని ఇంటికెళితే మత్తు పెట్టి వివస్త్రను చేసి నగ్నవీడియోలు తీశాడు...
- కుమార్తెలపై కన్నేశాడనీ... భర్తను హతమార్చి ఇంట్లోనే పాతిపెట్టిన భార్య!
- ఆర్డర్ ఆలస్యం చేసారు, వద్దన్నందుకు మహిళపై జొమాటో బాయ్ పిడిగుద్దులు
చేప ఆకారంలో వింత శిశువు జననం.. ఎక్కడ?
తెలంగాణా రాష్ట్రంలో ఓ వింత శిశువు జన్మించాడు. ఈ శిశువు చేప ఆకారంలో ఉండటం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ పాతబస్తీలోని నయాపూల్ ఆసుపత్రిలో సంగారెడ్డికి చెందిన ఓ మహిళ బుధవారం ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ బిడ్డ వింతగా పుట్టాడు.
శిశువులో చెవితోపాటు చేతి వేళ్లు సక్రమంగా అభివృద్ధి చెందలేదు. రెండు కాళ్లు కలిసిపోయి చేప ఆకారాన్ని తలపించాయి. అయితే, ఈ శిశువు పుట్టిన కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయాడు. క్రోమోజోముల విశ్లేషణతోపాటు ఇతర ఇన్‌ఫెక్షన్ల ప్రభావం తెలుసుకునేందుకు ప్లసంటా (మాయ)ను బయాప్సీకి పంపినట్లు వైద్యులు తెలిపారు.
దీనిపై గాంధీ ప్రసూతి విభాగాధిపతి డాక్టర్ మహాలక్ష్మి మాట్లాడుతూ.. శిశువు తల్లి కడుపులో ఉన్నప్పుడు మొదటి 8-12 వారాలు కీలకం. మత్తు పదార్థాల వినియోగం, ఇన్‌ఫెక్షన్లు, పోషకాహారం, ఫోలిక్ యాసిడ్ లోపంతో ఇలాంటి శిశువులు జన్మించే అవకాశాలు ఉన్నాయి. దగ్గర సంబంధాలు, మేనరిక వివాహాల వల్ల కూడా జన్యుపరమైన లోపాలు తలెత్తి ఇలా జరుగుతుంది. స్కానింగ్‌లో 20 శాతం వరకు శిశువులో లోపాలను కనిపెట్టే పరిస్థితి ఉండకపోవచ్చు అని వివరించారు.
