1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Inter Board bans Narsingi Sri Chaitanya college

నార్సింగిలోని శ్రీచైతన్య కాలేజీ గుర్తింపు రద్దు

suicide
నార్సింగిలోని శ్రీచైతన్య కాలేజీపై ఇంటర్ బోర్డు చర్యలకు ఉపక్రమించింది. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ఆ కాలేజీ గుర్తింపును రద్దు చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరంలో ఫస్టియర్ అడ్మిషన్లు చేపట్టకుండా నిషేధం విధించింది. 
 
కాలేజీల నిర్వహణను ప్రిన్సిపాల్స్, లెక్చరర్ల మీద వదిలేసి... ఏదైనా జరిగిన తర్వాత తమకేం సంబంధం లేదని యాజమాన్యాలు చెపితే కుదరదని, క్రిమినల్ కేసులు ఉంటాయని ఇంటర్ బోర్డు హెచ్చరించింది.  
 
కాగా.. హైదరాబాద్ నార్సింగిలోని శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి సాత్విక్ ఆత్మహత్యకు పాల్పడటం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.  
తర్వాతి కథనం
TS:ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్