శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 మార్చి 2023 (14:39 IST)

TS:ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్

exams
తెలంగాణ ఇంటర్ విద్యార్థులు హాల్ టిక్కెట్లను అప్‌లోడ్ చేసినట్లు బోర్డు అధికారులు తెలిపారు. తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 15 నుంచి ప్రారంభం అవుతున్న సంగతి తెలిసిందే. 
 
పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నేరుగా వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు పొందవచ్చని, హాల్ టికెట్‌లో ఫోటో, సంతకం, పేరు, సబ్జెక్ట్ తదితర విషయాల్లో తప్పులు ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే కాలేజీ ప్రిన్సిపాల్, లేదా బోర్డుకు తెలియజేయవచ్చు. 
 
హాల్‌టికెట్‌పై కాలేజీ ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా పరీక్ష రాసేందుకు అనుమతి ఇస్తున్నామని తెలిపారు. హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోగానే.. విద్యార్థులు ముందుగా పూర్తిగా వ్య‌క్తిగ‌త వివ‌రాలు స‌రిచూసుకోవాలి.