శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 22 ఫిబ్రవరి 2023 (08:20 IST)

పెళ్లికాని అమ్మాయిలు ఫోన్ల వాడకంపై గుజరాత్ ఠాకూర్ కమ్యూనిటీ నిషేధం

mobile
గుజరాత్ రాష్ట్రంలోని ప్రముఖ కమ్యూనిటీ అయిన గుజరాత్ ఠాగూర్ సమాజం అమ్మాయిలు మొబైల్ ఫోన్లను వినియోగంపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం తమ కమ్యూనిటీ నిబంధనల్లో పలు సంస్కరణలు తీసుకొచ్చింది. మొబైల్ ఫోన్ల వల్ల అమ్మాయిలు పెడదారి పట్టే అవకాశం ఉందని పెద్దలు హెచ్చరించారు. ఇందుకోసం పలు సంస్కరణలు తీసుకొచ్చారు. వీటిని కాంగ్రెస్ ఎమ్మెల్యే సమక్షంలో ఆమోదించారు. అలాగే, నిశ్చితార్థానికి 11 మంది, పెళ్లికి 51 మంది అతిథిలకు మాత్రమే అవకాశం కల్పించాలని కోరారు. వివాహాల్లో డీజే సౌండ్ వినియోగంపై కూడా వారు నిషేధం విధించారు. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే మాత్రం భారీగా జరినామా విధిస్తామని తెలిపారు. 
 
బనస్కాంత జిల్లా భభర్ తాలూకాలోని లున్సెలా గ్రామంలో గుజరాత్ ఠాగూర్ కమ్యూనిటీ పెద్దలు సమావేశమయ్యారు. ఇందులో అనేక అంశాలపై చర్చించి, కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా, అమ్మాయిలు మొబైల్ ఫోన్లు వాడటం వల్ల అమ్మాయిలు పెడదారిపట్టే అవకాశం ఉందని ఆ కమ్యూనిటీ పెద్దలు భావించారు. అందుకే వివాహంకాని అమ్మాయిలు ఫోన్లు వాడకంపై నిషేధం విధించినట్టు తెలిపారు. అయితే, ప్రేమ వ్యవహారాలు, అమ్మాయి - అబ్బాయి స్నేహాలు, కులాంతర వివాహాల గురించి మాత్రం ఇక్కడ ప్రస్తావించలేదు.
 
పైగా, తమ సామాజిక వర్గం వారు ప్రతి ఒక్కరూ ఈ నియమ నిబంధనలకు కట్టుబడి వుండాలని ఉల్లంఘిస్తే జరిమానా తప్పదని హెచ్చరించారు. జరిమానాల ద్వారా వచ్చే సొమ్మును విద్యతో పాటు తమ సామాజిక వర్గంలోకి సౌకర్యాల కల్పనకు ఖర్చు చేస్తామని సంఘం ప్రకటించింది. ఉన్నత చదువుల కోసం గ్రామం నుంచి బాలికలు నగరాలకు వెళ్లేటపుడు వారికి రవాణా సౌకర్యం కూడా ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జెనీబెన్ ఠాగూర్ సమక్షంలో చేసిన తీర్మానాల్లో పేర్కొన్నారు.