శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 మార్చి 2023 (11:01 IST)

నార్సింగి‌లో తరగతి గదిలో విద్యార్థి ఆత్మహత్య

suicide
హైదరాబాద్ నగరంలోని నార్సింగ్‌లోని శ్రీ చైతన్య కాలేజీలో విషాదకర ఘటన జరిగింది. ఇక్కడ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఒకరు ఒత్తిడిని తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడిని ఎన్.సాత్విక్‌గా గుర్తించారు. మంగళవారం రాత్రి 10.30 గంటల సమయంలో తరగతి గదిలోనే ఈ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాలేజీతో పాటు చదువుల్లో ఒత్తిడి వల్లే సాత్వికి ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. 
 
మరోవైపు, సూసైడ్ తర్వాత కాలేజీ యాజమాన్యం ప్రవర్తించిన తీరు ఇపుడు సర్వత్రా విమర్శలకు దారితీస్తుంది. సాత్విక్ ఉరేసుకున్నట్టు తెలిసినప్పటికీ కాలేజీ యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కనీసం ఆస్పత్రికి కూడా తరలించలేదని వారు పేర్కొంటున్నారు. 
 
చివరకు సాటి విద్యార్థులంతా కలిసి సాత్విక్‌ను కిందకు దించి, ఇతరుల ద్వారా వాహనం సాయం తీసుకుని ఆస్పత్రికి తరలించారు. అయితే, సాత్విక్‌ను ఆస్పత్రికి తరలించేలోపు ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.