గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 జనవరి 2023 (18:06 IST)

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు షాకింగ్ న్యూస్.. ఒక్కరోజే సెలవు

students telangana
తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు షాకింగ్ న్యూస్. సంక్రాంతి సెలవులపై తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు ఒక్కరోజే హాలీడే. పండుగకు జనవరి 14 నుంచి 16 వరకు కేవలం మూడు రోజులు మాత్రమే సెలవులు ఇచ్చారని, అందులో జనవరి 14వ తేదీ రెండో శనివారం, 15 నాడు ఆదివారం పోతే, సెలవులు ఇచ్చింది ఒక్కరోజే. 
 
దూర ప్రాంతాల్లో హాస్టల్ లో తాము ఇంటికి వెళ్లి వచ్చేసరికి ప్రయాణం సెలవులు ముగిసిపోతాయని వాపోతున్నారు. అయితే ఏపీలో సంక్రాంతి సెలవుల్లో మార్పులు చేసినట్లు జగన్ సర్కారు ప్రకటించింది. 
 
తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జనవరి  11 నుంచి 16 వరకు సెలవులు వుండగా, వీటిని 12 నుంచి 17వ తేదీ వరకు మార్పులు చేశారు. తాజాగా ఈ నెల 18వ తేదీ వరకు సెలవులు పొడిగించిన సర్కారు.. ఈ నెల 19న పాఠశాలలను పునః ప్రారంభం అవుతాయని పేర్కొంది.