1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. KCR today visits Delhi and returns on Sunday

మూడు రోజుల పర్యటన కోసం హస్తిన కోసం సీఎం కేసీఆర్

CM KCR
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు హస్తిన బాటపట్టారు. ఆయన మూడు రోజుల పర్యటన కోసం శుక్రవారం మరోమారు ఢిల్లీకి వెళుతున్నారు. 
 
శుక్రవారం ఉదయం శాసనసభ సమావేశం, బీఏసీ భేటీ అనంతరం ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరుతారు. కేంద్రమంత్రులతో కేసీఆర్ కీలక అంశాలపై చర్చిస్తారని సమాచారం.
 
కృష్ణా, గోదావరి నదీ జలాల అంశాలు, నదీ యాజమాన్య బోర్డుల పరిధి నోటిఫికేషన్ సంబంధిత అంశాలపై కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో కేసీఆర్‌ చర్చిస్తారు. 
 
మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతిభద్రతలు, అభివృద్ధి పనులపై ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నిర్వహించే ముఖ్యమంత్రుల సమీక్షకు కేసీఆర్ హాజరవుతారు.
 
అనంతరం పీయూష్ గోయల్‌తోనూ సమావేశమవుతారు. ఆదివారం సాయంత్రం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. కాగా, ఈ నెల 1న ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ 9 రోజులపాటు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత రెండు వారాలకే మళ్లీ ఢిల్లీ వెళ్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
తీన్మార్ మల్లన్న మళ్లీ అరెస్టు - మళ్లీ జైలుకు తరలింపు