సంబంధిత వార్తలు
- భక్తి ముసుగులో బాబా రక్తి - 11 మంది మహిళలతో అక్రమ సంబంధం
- నిప్పు లేకుండా తగలబడుతున్న ఇళ్లు... వణికిపోతున్న ప్రజలు.. ఎక్కడ?
- అనంతపూరి జిల్లాలో ఢీకొన్న లారీ - జీపు .. ముగ్గురి మృతి
- తెలంగాణలో రాజన్న రాజ్యమే లక్ష్యం.. నేడు నల్గొండలో వైఎస్ షర్మిల దీక్ష
- వాహనాల్లో మంటలు.. ఆందోళనలో చోదకులు... దగ్దమైన టాటా ఏస్
ఆగివున్న లారీన ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు : ముగ్గురి మృతి
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్యాలగూడ చింతపల్లి హైవే వద్ద ఓ ప్రైవేట్ బస్సు రోడ్డుపైన ఆగివున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా, 10మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని స్థానిక మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాద వార్త తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి బస్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణమని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. మృతి చెందినవారిని నాగేశ్వరరావు(44), జయరావు(42), మల్లికార్జున్(40)గా పోలీసులు గుర్తించారు.
తర్వాతి కథనం
