గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 2 ఆగస్టు 2021 (08:43 IST)

అనంతపూరి జిల్లాలో ఢీకొన్న లారీ - జీపు .. ముగ్గురి మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ జిల్లాలోని గుత్తి జాతీయ రహదారిపై జీపు, లారీ ఢీకొట్టుకొన్నాయి. ఈ ఘటనలో జీపులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ మృతులందరినీ గుల్బర్గాకు చెందిన వారిగా గుర్తించారు. 
 
అనంతపూర్‌ నుంచి కర్నూలుకు వెళ్తున్న జీపును రాంగ్‌ రూట్‌లో వచ్చిన లారీ కారును ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. లారీ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జవగా.. లారీ రోడ్డుపై బోల్తాపడింది. జీపులోనే మృతదేహాలు చిక్కుపోయాయి. 
 
ఈ ప్రమాదం వార్త తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్రేన్‌ సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు. ఘటనలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా.. అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులను అష్రఫ్‌ అలీ (68), లాయక్‌ అలీ (45)గా గుర్తించారు.