సంబంధిత వార్తలు
- ఏపీ సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడు స్టీఫెన్ రవీంద్రకు కరోనా
- రేపు హుస్సేన్‌సాగర్‌కు ఖైరతాబాద్ మహాగణపతి, 50 వేల సీసీటీవి కెమేరాలతో...
- సారీ, వాళ్లు నాపై అత్యాచారం చేయలేదు, 36 మంది మాత్రం: మిర్యాలగూడ యువతి
- హైదరాబాద్‌లో కోవిడ్ 19 పైన యుద్ధం: మేము సైతం అంటున్న న్యూబెర్గ్ డయాగ్నోస్టిక్స్
- తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై సంతకం చేశారు: ప్రణబ్ గురించి కేసీఆర్
హైదరాబాదులో కిడ్నాపర్లు.. మహిళను లాడ్జికి తీసుకెళ్లి..?
హైదరాబాదులో కిడ్నాపర్లు విరుచుకుపడ్డారు. ఇంట్లో ఉన్న మహిళను బలవంతంగా అపహరించుకెళ్లారు. కారులో కిడ్నాప్ చేశారు. ఓ లాడ్జ్ లో నిర్భంధించి దాడి చేసి.. అమానవీయంగా ప్రవర్తించారు. ఆ యువతికి నరకం చూపించారు.
వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా నారాయణపురం గ్రామంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుంది బాధితురాలు.. భర్త ల్యాబ్ టెక్నీషియన్‌గా చేస్తుండేవాడు. అయితే, రాయదుర్గం మణికొండ ప్రాంతంలో ఉండే ఆవుల రాజేష్ అనే వ్యక్తి వందల కోట్ల వ్యాపారం చేస్తుంటాడని.. ప్రస్తుతం ఆయనకు కొంత డబ్బు అవసరముందంటూ కొందరు వ్యక్తులు మూడేళ్ల క్రితం బాధిత నర్సును కలిశారు. రూ.55 లక్షల రూపాయలను అప్పుగా ఇస్తే వారం..పది రోజుల్లో రెట్టింపు డబ్బులు ఇస్తానని నమ్మించాడు ఆవుల రాజేష్.
అంతేకాదు.. నమ్మకం లేకుంటే వనపర్తిలోని ఏడు ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేస్తానని.. డబ్బుకు రెట్టింపు ఇస్తానని నమ్మించాడు.. చెక్కులు ఇచ్చాడు. కానీ, పత్రాల్లో మాత్రం నెల రోజుల్లో బాకీ డబ్బు తిరిగి ఇస్తానని రాసిచ్చాడు. అయితే, బాకీ డబ్బు గురించి అడిగితే వనపర్తిలో ఇస్తానని చెప్పిన ఏడు ప్లాట్లకు బదులు రెండు ప్లాట్లను మాత్రమే రిజిస్ట్రేషన్ చేశాడని బాధితురాలు వాపోయింది.
అంతటితో ఆగకుండా బాధిత మహిళ ఇంటికి కారులో వచ్చిన సోమశేఖర్, నక్కల రాజేందర్ యాదవ్, పవన్ రెడ్డి అనే వ్యక్తులు.. ఆ వివాహితను కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత శంషాబాద్‌లోని ఓ లాడ్జిలో నిర్బంధించారు. అప్పటికే ఆ లాడ్జిలో ఉన్న మరో ఏడుగురు కూడా కలిసి.. బాధితురాలిని చిత్రహింసలకు గురిచేశారు. మహిళను తాకరాని చోట్ల తాకుతూ పైశాచికానందం పొందారు.
శారీరరంగా, మానసికంగా క్రూరంగా హింసలకు గురిచేశారు. కత్తులతో బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. కిడ్నాప్‌కు పాల్పడ్డ నిందితుల కోసం గాలిస్తున్నారు.