మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 31 ఆగస్టు 2020 (20:46 IST)

హైదరాబాద్‌లో కోవిడ్ 19 పైన యుద్ధం: మేము సైతం అంటున్న న్యూబెర్గ్‌ డయాగ్నోస్టిక్స్‌

భారతదేశంలో నాల్గవ అతిపెద్ద పాథాలజీ సంస్థ న్యూబెర్గ్‌ డయాగ్నోస్టిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నేడు, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) నుంచి హైదరాబాద్‌లో కోవిడ్‌- 19 పరీక్షల కోసం అనుమతులు పొందినట్లు వెల్లడించింది. ఈ కంపెనీ ఇంటి వద్దనే పరీక్షలు నిర్వహించడం మరియు నమూనాలను సేకరించడాన్ని నగరవ్యాప్తంగా చేయనుంది. కోవిడ్ 19 పరీక్షల కోసం అహ్మదాబాద్‌ (న్యూబెర్గ్‌ సుప్రాటెక్‌), బెంగళూరు(న్యూబెర్గ్‌ ఆనంద్‌), చెన్నై(న్యూబెర్గ్‌ ఎర్లిచ్‌), కొచి (న్యూబెర్గ్‌ డయాగ్నోస్టిక్స్‌) మరియు పూనె(న్యూబెర్గ్‌ ఏ.జి. డయాగ్నోస్టిక్స్‌)లకు తొలుత కోవిడ్ 19 పరీక్షల కోసం అనుమతులను న్యూబెర్గ్‌ అందుకుంది.
 
ఈ అనుమతులను గురించి శ్రీమతి ఐశ్వర్య వాసుదేవన్‌, గ్రూప్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌, న్యూబెర్గ్‌ డయాగ్నోస్టిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మాట్లాడుతూ ‘‘దేశవ్యాప్తంగా కోవిడ్ 19 కేసులు గణనీయంగా పెరుగుతున్న వేళ, ఈ మహమ్మారితో పోరాడటంలో  కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలతో పాటుగా ఈ యుద్ధంలో ముందుండి పోరాడుతున్న వ్యక్తులకు మద్దతునందించడంలో భాగంగా ఆరోగ్య సంరక్షణ నిపుణులతో చేతులు కలపడం మా విధి. దేశంలో ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు చేసేందుకు ఐసీఎంఆర్‌ నుంచి అనుమతులు పొందిన మా ఏడవ ల్యాబ్‌ ఇది. దీనితో పాటుగా ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలను సైతం మేము చేయనున్నాం’’ అని అన్నారు.
 
తెలంగాణా రాష్ట్రంలో గత వారం రోజులలో ప్రతి రోజూ బయటపడుతున్న కోవిడ్‌ 19 కేసులలో 2.5% వృద్ధి నమోదవుతుంది. ప్రస్తుతం ఇది రెండు మరియు మూడు దశల వ్యాప్తి నడుమ ఉంది. తెలంగాణా రాష్ట్రంలో ప్రతి 10 లక్షల మంది జనాభాలోనూ 3,155 మంది కోవిడ్‌ 19 వైరస్‌కు పాజిటివ్‌గా నిర్థారించబడుతున్నారు. ఈ వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడానికి తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలను తీసుకుంటుంది. పరీక్షల పరంగా తమ మద్దతును అందించడంతో పాటుగా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడంలో ప్రభుత్వానికి సహాయపడుతుండటం పట్ల న్యూబెర్గ్‌ సంతోషంగా ఉంది.
 
‘‘ప్రస్తుత పరిస్థితులు మరిన్ని పరీక్షలను డిమాండ్‌ చేస్తున్నాయి. సమాజంలోని బలహీన వర్గాల కోసం మేము ప్రత్యేక మద్దతు నిధిని పరిచయం చేశాం. దీనిద్వారా, మేము పూర్తి ఉచితంగా బీపీఎల్‌ రేషన్‌ కార్డు ఉండి, తగిన డాక్టర్‌ ప్రిస్ర్కిప్షన్‌ ఉన్న ప్రజలకు పరీక్షలను నిర్వహించనున్నాము. ఇంటి వద్దనే నమూనాల సేకరణతో పాటుగా మేము హైదరాబాద్‌ వ్యాప్తంగా టెస్టింగ్‌ కియోస్క్‌లను సైతం పరిచయం చేయబోతున్నాము. అక్కడ తమంతట తాముగా పరీక్షలను అతి తక్కువ మానవ స్పర్శతో చేయించుకోవచ్చు.  అంతర్జాతీయ ప్రమాణాలతో కొలవదగిన సురక్షితమైన, సౌకర్యవంతమైన సంరక్షణను అందించడాన్ని న్యూబెర్గ్‌ విశ్వసిస్తుంది’’ అని శ్రీమతి ఐశ్వర్య వాసుదేవన్‌ అన్నారు.
 
న్యూబెర్గ్‌ యొక్క ల్యాబ్‌లలో కోవిడ్ 19 పరీక్షలను అత్యంత కఠినమైన ఐసీఎంఆర్‌ మరియు ఇతర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ చేయడం జరుగుతుంది. ఆస్పత్రులు, నర్సింగ్‌ హోమ్స్‌, ఇతర ఆరోగ్య సంరక్షణ ప్రదాతల నుంచి వచ్చిన కోవిడ్ 19 నమూనాలను ల్యాబ్‌లలో పరీక్షిస్తారు.
 
ప్రైవేట్‌ లేబరేటరీలలో కోవిడ్‌ 19 పరీక్షల కోసం ఐసీఎంఆర్‌ జారీ చేసిన మార్గదర్శకాలకనుగుణంగా, న్యూబెర్గ్‌ ఈ పరీక్షలకు అర్హత కలిగిన ఫిజీషియన్‌ సూచించిన మీదట మాత్రమే వ్యక్తులకు పరీక్ష చేయడం జరుగుతుంది. అలాగే ఐసీఎంఆర్‌ నిర్థేశించిన నమూనా సేకరణ మరియు పరీక్షా మార్గదర్శకాలకు సైతం కట్టుబడి ఉంది. న్యూబెర్గ్‌ వద్ద కోవిడ్ 19 పరీక్షలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం న్యూబెర్గ్‌ డయాగ్నోస్టిక్‌ కేంద్రంకు ఫోన్‌ ద్వారా సంప్రదించవచ్చు.