మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 31 ఆగస్టు 2020 (14:09 IST)

నాపై 139 మంది అత్యాచారం అబద్ధం, నన్ను ఒక్కరు కూడా చేయలేదు, అంతా డాలర్ బోయ్ భయంతోనే?

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోనూ చర్చనీయాంశంగా మారిన 139 మంది రేప్ కేసులో బాధిత యువతి యు-టర్న్ తీసుకుంది. తనపై 139 మంది అత్యాచారం చేశారన్నది అంతా అబద్ధమనీ, తనను డాలర్ బోయ్ అనే వ్యక్తి బెదిరించి ఇలా అబద్దం చెప్పించాడని వెల్లడించింది. సెలబ్రిటీలను ఇలా బయటకు లాగి వారిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బు గుంజాలని ఇలా తనతో చెప్పించాడనీ, చెప్పకపోతే చంపేస్తానని బెదిరించాడని చెప్పుకొచ్చింది.
 
తనపై ఒక్కరు కూడా అత్యాచారం చేయలేదని లిఖితపూర్వకంగా తెలిపింది. కాగా గత కొన్నిరోజులుగా నటుడు కృష్ణుడు, యాంకర్ ప్రదీప్‌లకు ఈ యువతి చేసిన వ్యాఖ్యలతో మనశ్శాంతి లేకుండా పోయింది. ఐతే ఆమె ఎవరో తమకు తెలియదని లబోదిబోమని చెప్పారు కూడా. మొత్తమ్మీద ఇపుడు ఈ యువతి ఇలా ట్విస్ట్ ఇవ్వడంతో కేసుపైన పోలీసులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది. 
 
కాగా 11 ఏళ్లుగా తనపై 139 మంది అత్యాచారం చేశారంటూ సంచలన ఆరోపణలు చేసిన బాధిత యువతి ఓ ప్రైవేటు టెలివిజన్ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆమె చెప్పిన వివరాలు ఆమె మాటల్లోనే.. హైదారాబాదులో గెస్ట్ హౌసులకు డిఫరెంట్ అమ్మాయిలను తీసుకువచ్చేవారు. ఆ తర్వాత వారందరికీ ఆల్కహాల్ తాగించి స్పృహ కోల్పోగానే అత్యాచారం చేసేవారు.
 
మరుసటి రోజు ఆ దృశ్యాలు తాలూకు వీడియోలను చూపించి బ్లాక్ మెయిల్ చేసేవారు. బట్టల్లేకుండా ఒక అమ్మాయి ఫోటోలను ఎక్కడైనా షేర్ చేస్తే, అవి బయటకు వస్తే ఇక చచ్చిపోవడం తప్పించి వేరే మార్గం ఏముంటుంది? నన్ను అనుభవించేవారు. నా ఎకౌంటులో డబ్బులు వేయించుకుని వాళ్లే తీసుకునేవారు.
 
నన్ను తమ స్నేహితురాలు అని చెప్పి తీసుకెళ్లి వారికి అప్పజెప్పేవారు. 2012 నుంచి నరకం చూశాను. పెళ్లయిన తర్వాత నాపై మా బావ అత్యాచారం చేశాడు. అక్కడి నుంచి తప్పించుకుని హైదరాబాద్ వస్తే ఇక్కడ ఇంతమంది నాపై అత్యాచారం చేశారు. నా కుటుంబ సభ్యులకు చెపితే, నా బలహీనతలు తెలుసుకుని, నా తమ్ముడిని కొట్టారు. దాంతో భయంవేసి సైలెంట్ అయిపోయా.
 
నన్ను ఎక్కడికి తీసుకెళ్లినా ఆల్కాహాలు తాగించి దుస్తులు తీసేసి నన్ను మూలన పడేసేవారు. ఇంకా ఏవేవో మత్తు పదార్థాలు నా ముక్కు దగ్గర పెట్టి వాసన చూపించేవారు, దానికి కళ్లు తిరిగి పడిపోయేదాన్ని. ఆ తర్వాత నాపై అత్యాచారం చేసేవారు. 2014లో నన్ను ఓ గదికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. అప్పుడు నేను ఓ వ్యక్తిని చూశాను. అతడు పాపులర్ యాంకర్ అని చెప్పారు. నాపై అతడు అత్యాచారం చేస్తున్నాడు. 
 
కళ్లు తెరిచి చూడగానే ఎదురుగా వున్నాడు. ప్లీజ్.. నన్ను వదిలేయండి అని అతడి కాళ్లావేళ్లా పడ్డాను. అతడు ఏమాత్రం కనికరం చూపించలేదు. నాపై భౌతిక దాడి చేసి ఆల్కహాలు తాగించి అత్యాచారం చేశాడు. చాలామంది మేం మంచిగా చూసుకుంటామని చెప్పి నన్ను వాడుకున్నారు. వేరే అమ్మాయిల నగ్న ఫోటోలను నాకు పంపించి అలా కావాలని అడిగేవారు'' అంటూ చెప్పింది బాధితురాలు. మిర్యాలగూడకు చెందిన బాధిత యువతి పంజాగుట్ట పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇదంతా అబద్ధమని షాక్ ఇచ్చింది.