1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. One more TRS MLA tests positive for COVID-19 in Telangana

తెలంగాణాలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

Telangana
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. అదేసమయంలో ఈ వైరస్ బారిన ఆ రాష్ట్ర ప్రజా ప్రతినిధులు కూడా పడుతున్నారు. రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ఈ వైరస్ బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా మరో ఎమ్మెల్యే ఈ వైరస్ కోరల్లో చిక్కున్నారు. ఆయన పేరు బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి. 
 
నిజామాబాద్‌ రూరల్‌ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న బాజిరెడ్డి గోవర్థన్‌కు కరోనా జిటివ్‌ అని వైద్యులు నిర్ధారించారు. ఆయన 3 రోజుల నుంచి జ్వరం, దగ్గుతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 
 
ఆ తర్వాత ఆయనకు వైద్య పరీక్షలు చేయగా, కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన్ను వెంటనే చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఆయన శనివారం నాడు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతికి మోదీ, సచిన్, మహేశ్ బాబు, పూజా హెగ్డే, తమన్నా తదితరుల సంతాపం