సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 జూన్ 2020 (16:54 IST)

తెలంగాణలోకి మిడతలు.. పెద్దంపేటలో చెట్ల ఆకుల్ని నమిలేస్తున్నాయ్

మహారాష్ట్రలో ఉన్న మిడతలు దక్షిణ దిశలో ప్రయాణిస్తే తెలంగాణకు చేరుకుంటాయని… ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనించి, తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
 
తాజాగా ఈ మిడతల గుంపు తెలంగాణలోకి ప్రవేశించినట్టు తెలుస్తుంది. మహారాష్ట్ర నుంచి జయశంకర్ జిల్లా మహదేవ్ పూర్ మండలం పెద్దంపేట ప్రాంతంలోకి మిడతలు ప్రవేశించాయి. పెద్దంపేట గోదావరి పరీవాహక ప్రాంతంలో చెట్లను నాశనం చేస్తున్నాయి. దీంతో, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక్కసారిగా అలజడి చెలరేగింది.
 
పెద్దంపేట గోదావరి పరివాహక ప్రాంతంలో చెట్ల ఆకులను నమిలి పారేస్తున్నాయి. దీంతో, ఆ చుట్టుపక్కల ప్రాంతాల రైతులు తమ పంట పొలాలను సర్వనాశనం చేస్తాయని భయపడుతున్నారు. అక్కడి నుంచి అవి ఎటువైపు వెళ్తాయనే ఆందోళన నెలకొంది.