శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 14 జూన్ 2020 (15:31 IST)

అంత్యక్రియల్లో పాల్గొన్న 19 మదికి కరోనా పాజిటివ్

కరోనా వైరస్ కారణంగా ఏ ఒక్క కార్యక్రమంలో పాల్గొనాలన్నా భయంతో వణికిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా అంత్యక్రియల్లో పాల్గొన్న 19 మందికి కరోనా వైరస్ సోకింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని జహీరాబాద్‌లో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్, జహీరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఓ మహిళ ఇటీవల ప్రాణాలు కోల్పోయింది. ఆమె మృతదేహాన్ని బంధువులకు అప్పగించడంతో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, ఈ అంత్యక్రియల్లో పాల్గొన్న వారిలో ఒకరికి కరోనా వైరస్ సోకివుంది. ఈ విషయం తెలియకపోవడంతో ఆ రోగిని పలువురు తాకారు. 
 
ఇలా ఏకంగా 19 మందికి ఈ వైరస్ సోకింది. దీంతో వీరందరినీ ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అంతేకాకుండా, వీరితో కాంటాక్ట్ అయిన వారిని గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. కాగా, చాలా మంది సామాజిక భౌతికదూరం పాటించకపోవడం, ముఖానికి మాస్కులు ధరించక పోవడం వల్లే కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తున్నాయి.