1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. Tollywood popular director Teja expressed the opinion that Coronavirus positive cases

రోజుకు లక్ష కరోనే కేసులు నమోదు కావొచ్చు : దర్శకుడు తేజ

Teja
దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఫలితంగా ఇప్పటికే మూడు లక్షల కేసులు నమోదయ్యాయి. ప్రతి రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ కేసుల నమోదుపై ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో కరోనా వ్యాప్తిపై దర్శకుడు తేజ స్పందించారు. 
 
ప్రతిరోజు దేశంలో వేల సంఖ్యలో పెరిగిపోతోన్న కరోనా కేసులపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన మాట్లాడారు. 'ఇప్పుడు ప్రతి రోజు 11 లేదా 12 వేల కేసులు నమోదవుతున్నాయి. రోజుకి లక్ష కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. ఇండియా నంబర్‌ 1 వరస్ట్ పొజిషన్‌లోకి వెళ్లి పోతుంది' అని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.
 
'భారతీయుల తీరు ఇలాగే ఉంది. మన చుట్టూ ఉన్న వారికి కరోనా లేదని అనుకుంటున్నాము. మన స్నేహితులని, కూరగాయలు అమ్మే వారికి కరోనా లేదు కదా నాకు కూడా రాదు అని అనుకుంటున్నారు. నాకు కరోనా రాదు అనే భావనలో ఉన్నారు. 
 
కానీ, అందరిలోనూ కరోనా ఉందనే భావనతో వ్యవహరించండి. అలాంటప్పుడే కరోనాకు దూరంగా ఉండొచ్చు. కూరగాయలు కొన్న తర్వాత శానిటైజ్‌ చేయండి. సూపర్‌ మార్కెట్లో బిల్‌ కట్టి తిరిగి కార్డు తీసుకున్న తర్వాత శానిటైజ్ చేయండి' అని తేజ చెప్పారు. 
తర్వాతి కథనం
రికార్డు స్థాయిలో నమోదవుతున్న కరోనా కేసులు.. వణికిపోతున్న ప్రజలు