శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 13 జూన్ 2020 (08:23 IST)

టాలీవుడ్‌లో మళ్లీ 'ఇద్దరు మిత్రుల' కాంబినేషన్?

తెలుగు చిత్రపరిశ్రమలో ఇద్దరు మిత్రులుగా గుర్తింపు పొందిన వారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఒకరు హీరో.. మరొకరు దర్శకుడు. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో మూడు చిత్రాలు వచ్చాయి. ఒకటి జల్సా, రెండోది అత్తారింటికి దారేది. మూడోది అజ్ఞాతవాసి. ఇందులో అజ్ఞాతవాసి మినహా మిగిలిన రెండు చిత్రాలు సూపర్ డూపర్ హిట్. 
 
అయితే, ఇపుడు వీరిద్దరి కాంబినేషన్‌లో మరో చిత్రం తెరకెక్కనున్నట్టు వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్​ చెప్పిన స్టోరీలైన్​ నచ్చి పవన్​ దానికి అంగీకారం తెలిపాడని సమాచారం. స్క్రిప్ట్​ పనులు పూర్తవ్వగానే ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉందని చిత్రపరిశ్రమ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వీలైనంత త్వరగా స్క్రిప్ట్​ వర్క్​ను పూర్తి చేసి ప్రాజెక్టును ప్రారంభించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
 
కాగా, ప్రస్తుతం పవన్​ కల్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్​ దర్శకత్వంలో బాలీవుడ్ చిత్రం పింక్ తెలుగులోకి 'వకీల్​ సాబ్​' పేరుతో రీమేక్ జరుగుతోంది. ఈ చిత్రం పూర్తవ్వగానే క్రిష్​ డైరెక్షన్​లో రూపొందనున్న సినిమా షూటింగ్​లో పాల్గొనున్నారు. 
 
మరోవైపు దర్శకుడు హరీశ్​ శంకర్​తో మరో చిత్రానికీ కమిట్​ అయ్యారు. లాక్డౌన్​ కారణంగా చిత్రీకరణలు ఎక్కడికక్కడే ఆగిపోయిన క్రమంలో క్రిష్​ సినిమా మరింత ఆలస్యం అయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్​తో సినిమాను పట్టాలెక్కించనున్నట్లు సమాచారం.