1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Rahul Gandhi mourns Aishwarya Reddy's suicide

తన చదువు తండ్రికి భారం కాకూడదని ఐశ్వర్య ఆత్మహత్య, సంతాపం తెలిపిన రాహుల్ గాంధీ

Rahul Gandhi
లాక్ డౌన్ సమయంలో హాస్టల్ యాజమాన్యం బలవంతంగా ఖాళీ చెయ్యమనడంతో మనస్థాపానికి గురైన డిగ్రీ విద్యార్థిని ఐశ్వర్య రెడ్డి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తన చదువు తండ్రికి భారం కాకూడదన్న ఉద్దేశంతో ఐశ్వర్య ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
 
ఈ విషయం చాలామందిని కదలించింది. దీనిపై స్పందిచిన కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా స్పందిస్తూ ఈ విచారకర సందర్భంలో ఐశ్వర్య కుటుంబానికి తన సంతాపాన్ని తెలుపుకుంటున్నానని పోస్ట్ చేశారు. బీజేపీ అనాలోచితంగా రద్దు చేసిన నోట్లు, లాక్ డౌన్ దేశ వ్యాప్తంగా పలు కుటుంబాలను నాశనం చేసిందని తెలిపారు.
 
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌కు చెందిన ఐశ్వర్య ఇంటర్మీడియట్లో రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించారు. పైచదువుల కోసం ఢిల్లీ వెళ్లి అక్కడ శ్రీరామ డిగ్రీ కాలేజీలో చదువుతూ ఐఏఎస్ కోచింగ్ తీసుకుంది.
 
అయితే కరోనా కారణంగా తను ఉంటున్న హాస్టల్ యాజమాన్యం ఖాళీ చెయ్యమనడంతో కోవిడ్ నేపథ్యంలో తన కుటుంబానికి భారం కాకూడదని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నెల 3న ఆత్మహత్యకు పాల్పడిన ఐశ్వర్య తన కుటుంబ ఆర్థిక పరిస్థితులే ఇందుకు కారణమని సూసైడ్ నోట్ రాసింది. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది.
About Writer
వి
తర్వాతి కథనం
బ్రేకింగ్: కరోనాకు వ్యాక్సిన్.. 90 శాతం పనిచేస్తోంది.. అదేంటంటే?