శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 16 అక్టోబరు 2020 (16:04 IST)

భారత్ కంటే శత్రుదేశం పాకిస్థానే బెటర్: రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీ పూర్వ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో భారత్ కంటే శత్రుదేశమైన పాకిస్థాన్ బెటరంటూ వ్యాఖ్యానించారు. 
 
ఇదే అంశంపై ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేస్తూ... కోవిడ్ నియంత్ర‌ణ‌లో భార‌త్ క‌న్నా పాకిస్థాన్‌, ఆఫ్ఘ‌నిస్తాన్ దేశాలు బెట‌ర్‌గా ప‌నిచేశాయ‌ని, అందువల్లే ఆయా దేశాల్లో పాజిటివ్ కేసులు తక్కువగా ఉన్నాయన్నారు. 
 
ఇకపోతే, భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై ఐఎంఎఫ్ ఇచ్చిన అంచ‌నాల‌ను ప్ర‌స్తావించారు. ఈ ఏడాది భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ 10.3 శాతం కుంచించుకుపోతుంద‌ని ఐఎంఎఫ్ పేర్కొన్న విషయాన్ని ప్ర‌స్తావిస్తూ బీజేపీ ప్ర‌భుత్వం అద్భుత‌మైన ఘ‌న‌త సాధించిన‌ట్లు ఆయ‌న విమ‌ర్శించారు. 
 
ఇంట‌ర్నేష‌న‌ల్ మానిట‌రీ ఫండ్ ఇచ్చిన వృద్ధి అంచ‌నాల‌కు సంబంధించి గ్రాఫ్‌ను ఆయ‌న త‌న ట్వీట్‌లో పోస్టు చేశారు. ఆ గ్రాఫ్‌లో బంగ్లాదేశ్‌, మ‌య‌న్మార్‌, నేపాల్‌, చైనా, భూటాన్‌, పాకిస్థాన్‌, శ్రీలంక‌, ఆఫ్ఘ‌నిస్తాన్‌, ఇండియా దేశాల లెక్క‌లు ఉన్నాయి.