శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 9 అక్టోబరు 2020 (18:40 IST)

టిక్‌టాక్‌ యాప్‌కు షాక్.. పాకిస్థాన్‌లో కూడా బ్యాన్

భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన టిక్‌టాక్‌ యాప్‌తో సహా పలు చైనా యాప్స్‌ను నిషేధించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో కూడా టిక్‌టాక్‌ను బ్యాన్‌ చేశారు. అమెరికా లాంటి దేశాలలో కూడా టిక్‌టాక్‌ నిషేధించాలని ట్రంప్‌ సర్కార్‌ నిర్ణయించింది. 
 
ఇక ఇప్పుడు టిక్‌టాక్‌కు మరో భారీ షాక్‌ తగిలింది. చైనాకు అత్యంత సాన్నిహిత్యంగా ఉండే పాకిస్థాన్‌లో కూడా టిక్‌టాక్‌ యాప్‌ను బ్యాన్‌ చేసినట్లు ఆ దేశ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. 
 
అభ్యంతరకరమైన, అసహ్యమైన కంటెంట్‌ను టిక్‌టాక్‌లో షేర్‌ చేస్తున్నారని పాకిస్థాన్‌ టెలికమ్యూనికేషన్‌ అథారిటీ వెల్లడించింది. ఈ కారణంతో టిక్‌టాక్‌ను బ్లాక్‌ చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. దీనికి సంబంధించి టిక్‌టాక్‌కు ఇంతముందే సమయం ఇచ్చిన ఇప్పటి వరకు స్పందించలేదని అందుకే బ్యాన్‌ చేస్తున్నట్లు పాకిస్థాన్‌ ప్రకటించింది.